News


10941 వరకు నిఫ్టీ ర్యాలీ!

Tuesday 18th December 2018
Markets_main1545126128.png-23049

సాంక్టమ్‌ వెల్త్‌ అంచనా
దేశీయ మార్కెట్లు గత వారం లాభాల పరుగును కొనసాగిస్తున్నాయి. మంగళవారం ఆరంభంలో నష్టాలున్నా చివరకు సూచీలు లాభాల్లోకి మరలాయి. నిఫ్టీ 10900 పాయింట్ల వద్ద కదలాడుతోంది.

నిఫ్టీ 10840 పాయింట్లపైన ఉన్నంత వరకు పాజిటివ్‌గా ఉన్నట్లే భావించాలి. ఈ ఊపులో నిఫ్టీ క్రమంగా 10941 పాయింట్లను తాకేందుకు ఛాన్సులున్నాయి. ఇటీవల ర్యాలీ ఈ స్థాయిలవరకు కొనసాగింది. ఇక్కడ నిఫ్టీకి టాప్‌ ఎదురుకావచ్చు. ఈ స్థాయిని దాటితే నిఫ్టీ క్రమంగా 11089 పాయింట్ల వరకు ఎగిసే అవకాశం ఉంది. ఈ స్థాయి గత పతనానికి(11760- 10005 పాయింట్లు) 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి.

మొత్తం మీద 10941- 11100 పాయింట్ల వరకు నిఫ్టీకి పలు నిరోధాలు ఎదురుకావచ్చు. దిగువన 10840, 10750 పాయింట్ల వద్ద నిఫ్టీకి మద్దతు దొరుకుతుంది. 10750 పాయింట్లను కాపాడుకోలేకుంటే నిఫ్టీలో అప్‌మూవ్‌కు తెరపడి అమ్మకాల ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. 
ఆప్షన్‌ డేటా చూస్తే 10000 పాయింట్లు, 10500 పాయింట్ల వద్ద పుట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. 11000, 10900 పాయింట్ల వద్ద కాల్స్‌ అధికంగా ఉన్నాయి. 10900, 10800 పాయింట్ల వద్ద పుట్‌ రైటింగ్‌, 10800, 11000 పాయింట్ల వద్ద కాల్‌ అన్‌వైండింగ్‌ కనిపిస్తోంది. దీన్ని బట్టి మద్దతు స్థాయిలు కాస్త పెరిగినట్లు తెలుస్తోంది.

ఇండియా వీఐఎక్స్‌ 4 శాతం క్షీణించి 14.54 వద్ద కొనసాగుతోంది. ఈ నెల్లో వీఎక్స్‌ దాదాపు 24 శాతం క్షీణించింది. 



You may be interested

కొత్త ఏడాదికి క్రెడిట్‌సూసీ సిఫార్సులు

Tuesday 18th December 2018

వచ్చే సంవత్సరంలో మంచి రాబడినందించే సత్తా ఉన్న నాలుగు స్టాకులను క్రెడిట్‌సూసీ రికమండ్‌ చేసింది. 1. ఎల్‌అండ్‌టీ: అవుట్‌పెర్ఫామ్‌. టార్గెట్‌ రూ. 1700. దేశీయంగా రికవరీ మెరుగుపడడం, బలమైన నిధుల ప్రవాహం, ఆకర్షణీయమైన వాల్యూషన్లు, ఒకే ప్రాంతంపై ఎక్కువగా ఆధారపడే అవసరం తగ్గడం.. కంపెనీ షేరుపై ఆసక్తి పెంచుతున్నాయి. మార్జిన్లు అనూహ్యంగా పెరిగి అనుకోని అప్‌సైడ్‌ కదలికలను తీసుకురావచ్చు. హైదరాబాద్‌మెట్లో నష్టాలు తగ్గడం, ప్రైవేట్‌ పెట్టుబడుల సైకిల్‌ ఆరంభం కావడంతో కంపెనీ

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 10శాతం క్రాష్‌

Tuesday 18th December 2018

టార్గెట్‌ ధర తగ్గింపుతో పాటు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌తో మంగళవారం జీఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. నేడు బీఎస్‌ఈలో జీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు రూ.500ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) జీఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు రేటింగ్‌ను ‘‘అండర్‌ఫెర్మ్‌ఫామ్‌’’కు డౌన్‌గ్రేడింగ్‌ చేయడంతో పాటు షేరు ప్రస్తుత ధర నుంచి టార్గెట్‌ ధరను రూ.375లకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం షేరు ఎదుర్కోంటున్న ప్రమాదకర

Most from this category