STOCKS

News


11,000ల దిగువకు నిఫ్టీ

Thursday 27th September 2018
Markets_main1538043565.png-20649

మార్కెట్‌ పతనం ఆగట్లేదు. సెప్టెంబర్‌ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు చివరి తేది కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత, ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి మళ్లీ క్షీణించడం, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం, కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ తదితర అంశాలు మార్కెట్‌ నష్టాలకు కారణమయ్యాయి. ఫార్మా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ మెటల్‌ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాలతోనే ముగిశాయి. ఫలితంగా నిఫ్టీ సూచీ మళ్లీ 11000ల స్థాయిని చేజార్చుకుంది. సెన్సెక్స్‌ మరో 200 పాయింట్లను నష్టపోయింది. నిఫ్టీ సూచీ ఇంట్రాడేలో 101 పాయింట్లను కోల్పోయి 10953 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరకు 76.25 పాయింట్ల నష్టంతో 10,977 వద్ద ముగిసింది. ఇదే ఎన్‌ఎస్‌ఈలోని రూపాయి బలహీనతో ఒక్క ఐటీ ఇండెక్స్‌(అరశాతం లాభం) తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాలతో ముగిశాయి. అ‍త్యధికంగా ఫార్మా ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. ఇక కీలకమై నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.40శాతం(334 పాయింట్లు) నష్టపోయి 25,042 వద్ద ముగిసింది. మరో ప్రధాన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ 315 పాయిం‍ట్ల కోల్పోయి 36238 పాయింట్ల వద్ద కనిష్టస్థాయిని తాకింది. చివరికి 218 పాయింట్ల నష్టపోయి 36,324 వద్ద ముగిసింది.

మారుతి, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, బజాజ్‌ఫైనాన్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్స్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌, షేర్లు 3.50శాతం నుంచి 9శాతం వరకు నష్టపోగా, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పేయింట్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి.



You may be interested

ఎఫ్‌ఐఐల వాటా ఎక్కువ ఉంటే రిస్కేనా.?!

Friday 28th September 2018

ఇటీవలి స్టాక్‌ మార్కెట్‌ పతనానికి ఎన్నో అంశాలు నేపథ్యంగా ఉండగా, ఎఫ్‌ఐఐల అమ్మకాలతో స్టాక్స్‌ వారీగా నష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్‌ఐఐలు సెప్టెంబర్‌ నెలలోనే ఇంత వరకు రూ.12,000 కోట్లను భారత క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి తరలించుకుపోయారు. గత రెండు నెలల నుంచి వీరు నికర అమ్మకందారులుగానే ఉన్నారు. దీంతో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఎక్కువగా ఉన్న సుమారు 50 స్టాక్స్‌ ఏకంగా 20 నుంచి 50 శాతం మధ్య

ధర కాదు.. వ్యాల్యుయేషన్‌ చూడాలి..

Thursday 27th September 2018

ధర ప్రాతిపదికన కాకుండా వ్యాల్యుయేషన్స్‌ ఆధారంగా స్టాక్‌ను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు బోఫా-మెరిల్‌లించ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ మూకిన్‌. స్టాక్‌ కొనుగోలుకు ఎంత చెల్లిస్తున్నామనే దాన్ని వ్యాల్యుయేషన్స్‌ కోణంలో చూడాల్సి ఉందన్నారు. ఐటీ రంగం రక్షణాత్మక స్థానంలో ఉందని, అయితే ఇందులో వృద్ధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. కంపెనీల ఎర్నింగ్స్‌ వృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  ఈల్డ్స్‌

Most from this category