News


11600 పైన ముగిసిన నిఫ్టీ

Friday 29th March 2019
Markets_main1553855269.png-24865

127 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ 
రాణించిన మెటల్‌, అటో, ఫార్మా షేర్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజైన శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభంతో ముగిసింది. అంతర్జాతీయంగా పరిమాణాలు, దేశీయ సానుకూల సంకేతాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా ఏప్రిల్‌ డెరివేటివ్ సిరీస్‌ను సూచీలు భారీ లాభాలతో ప్రారంభించినట్లైంది. ఇంట్రాడేలో అటో, మెటల్‌, ఫార్మా షేర్లు లాభపడటంతో సెన్సెక్స్‌ 127 పాయింట్లు లాభంతో 38,673 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 11,624 వద్ద ముగిశాయి. అయితే గత కొద్దిరోజులుగా ర్యాలీ చేస్తున్న బ్యాంకింగ్‌ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 6 పాయింట్లు మాత్రమే స్వల్పంగా లాభపడి 30,426.80 వద్ద స్థిరపడింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు ఆశావహంగా జరుగుతున్న నేపథ్యంలో మెటల్‌ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. రేట్ల కోత అంచనాలతో అటో షేర్లు లాభపడగా, వాటితో పాటు ఫార్మా షేర్లు లాభపడ్డాయి. ఏప్రిల్‌ డెరివేటివ్ సిరీస్‌ను సెన్సెక్స్‌ 130 పాయింట్ల లాభంతో 38,675ల వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 11600పైన 11,625.45 వద్ద  ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్‌ 202 పాయింట్లు లాభపడి 38,748ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని, నిఫ్టీ 60పాయింట్లు పెరిగి 11,630 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే ఇన్వెస్టర్లు గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పూనుకోవడంతో మిడ్‌సెషన్‌ సమయానికి ఉదయం ఆర్జించిన లాభాల్ని కోల్పోయాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పూనుకోవడంతో యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం సూచీలను తిరిగి లాభాల బాట పట్టించింది. ఈ నెలలో ఇరు సూచీలు 7శాతం ర్యాలీచేయగా, కేవలం వారం రోజుల్లో 1శాతానికి పైగా లాభపడ్డాయి.
బీపీసీఎల్‌, యూపీఎల్‌, గ్రాసీం, వేదాంత, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 3శాతం నుంచి 6శాతం లాభపడ్డాయి. ఇన్ఫ్రాటెల్‌, బజాజ్‌-అటో, ఐషర్‌మోటర్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ గెయిల్‌ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి.



You may be interested

పల్లాడియంలో రికవరీ

Friday 29th March 2019

మూడు సెషన్లుగా భారీగా పతనమైన పల్లాడియం ధర శుక్రవారం కాస్త రికవరీ అయింది. శుక్రవారం ట్రేడింగ్‌లో రెండునెలల కనిష్ఠాల నుంచి కోలుకొని 1.1 శాతం లాభంతో 1363 డాలర్ల స్థాయికి చేరింది. వాహనాల్లో ఉత్ర్పేరక సహాయకారిగా దీన్ని ఉపయోగిస్తారు. గురువారం ట్రేడింగ్‌లో ఒక్కమారుగా పల్లాడియం ధర 7 శాతం వరకు పతనమైంది. రెండేళ్లలో ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ వృద్ది మందగమనంపై భయాలు కమోడిటీల

ఏప్రిల్‌ సీరిస్‌లో 12వేల పాయింట్లు పక్కా!

Friday 29th March 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా గత సీరిస్‌ మొత్తం నిఫ్టీ హయ్యర్‌ హై, హయ్యర్‌ లో ఏర్పరుస్తూ ముందుకు కొనసాగింది. చివరకు సీరిస్‌ను దాదాపు 7 శాతం పైచిలుకు లాభంతో ముగించింది. ఏప్రిల్‌ సీరిస్‌లోకి దాదాపు 66.73 శాతం రోలోవర్లు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 21 శాతం మేర పెరిగింది. దీన్ని బట్టి మార్చిలో లాంగ్స్‌ తీసుకున్న సంస్థాగత ఇన్వెస్టర్లు ఏప్రిల్‌లో కూడా తమ లాంగ్‌ పొజిషన్లను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోందని

Most from this category