News


రెండో రోజూ లాభాలే

Thursday 27th December 2018
Markets_main1545907990.png-23266

మార్కెట్‌ డిసెంబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టు గడువు ముగింపును లాభంతో ముగించింది. అధిక వెయిటేజ్‌ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్ల ర్యాలీ అండతో సూచీలు వరుసగా రెండోరోజూ లాభాల్లోనే ముగిశాయి. యూరప్‌, ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల ట్రెండ్‌ ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురిగొల్పింది. అయితే బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి లోనవ్వడంతో నిఫ్టీ 10800 మార్కును నిలబెట్టుకోవడంలో విఫలమైంది. చివరకు సెన్సెక్స్‌ 157 పాయిం‍ట్ల లాభంతో 35807 వద్ద, నిఫ్టీ 50 లాభంతో 10779.80 వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న మార్కెట్‌ నేడు భారీ లాభంతో ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో హెవీవెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల ర్యాలీతో నిఫ్టీ 104 పాయింట్ల లాభపడి 10,834.20 వద్ద, నెన్సెక్స్‌ 391 పాయింట్ల లాభపడి 36,041 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌ సెషన్‌ వరకు స్థిరమైన ర్యాలీ చేసి సూచీలు అనంతరం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. మిడ్‌సెషన్‌ అనంతరం ప్రారంభమైన యూరప్‌ మార్కెట్లు నష్టాల ప్రారంభం, నేడు డిసెంబర్‌ కాంట్రాక్టు ఎఫ్‌ అండ్ ఓ ఎక్స్‌పైరీ రోజు కావడంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 30 పైసల బలహీనత.. తదితర ప్రతికూలాంశాలతో సూచీల ప్రారంభ లాభాలు క్రమంగా కరుగుతూ వచ్చాయి. రూపాయి బలహీనతతో ఐటీ షేర్లు, ఐటీసీ షేరు ర్యాలీతో ఎఫ్‌ఎంజీసీ షేర్లు లాభ పడ్డాయి. బ్యాంకింగ్‌,అటో, ఫార్మా, ఫైనాన్స్‌ సర్వీసెస్‌ రంగాలకు చెందిన సూచీలు నష్టాలతో ముగిశాయి.
అదానీపోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫ్రాటెల్‌, జీలిమిటెడ్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 2.50శాతం నుంచి 2శాతం లాభపడగా, టాటాస్టీల్‌, భారతీఇన్ఫ్రాటెల్‌, హీరోమోటోకార్ప్‌, టాటామోటర్స్‌, బీపీసీఎల్‌ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం నష్టపోయాయి.



You may be interested

మీ పెట్టుబడి రెట్టింపు కావాలా... వెరీ సింపుల్‌!

Friday 28th December 2018

స్టాక్‌ మార్కెట్లో తమ పెట్టుబడి రెట్టింపు కావాలన్నదే ఎక్కువ మంది ఇన్వెస్టర్ల ఆకాంక్షగా కనిపిస్తుంది. తక్కువ వ్యవధిలోనే తమ పెట్టుబడి రెండింతలు కావాలన్న దృష్టితోనే స్టాక్స్‌ కొనుగోలు చేస్తుంటారు. కానీ, కొన్న తర్వాత ఆ స్టాక్‌ గమనం అనుకున్న విధంగా లేకపోయినా, రివర్స్‌లో నష్టపోతున్నా నిర్ణయాలు సరిగ్గా ఉండవు. దాంతో రెట్టింపు లాభం సంగతి దేవుడు ఎరుగు, అసలు లాభం బుక్‌ చేసుకునే వారు కొద్ది మందే ఉంటారు. ఈ

కరిగిపోయిన మిడ్‌క్యాప్‌ కంపెనీల ప్రమోటర్ల సంపద..!

Thursday 27th December 2018

ఈ ఏడాది మిడ్‌ క్యాప్‌ కంపెనీలు ఆశించిన స్థాయిలో రాణించలేపోయాయి. కంపెనీ లాభ నష్టాలతో పోలిస్తే వాల్యూవేషన్‌ అధికంగా వుండటం, స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లు ఒడిదుడుకులను నియంత్రించేందుకు అదనపు నిఘా చర్యల(ఏఎస్‌ఎం)ను ప్రవేశ పెట్టడం, సెబీ మ్యూచువల్ ఫండ్లని పునర్ వర్గీకరణ చేపట్టడం తదితర కారణలతో ఈ ఏడాది మిడ్‌క్యాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడిని తీవ్రతరమైందని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఈ ఏడాదిలోనే ఏకంగా 15శాతం క్షీణించి మార్కెట్‌

Most from this category