STOCKS

News


9రోజుల నష్టాలకు బ్రేక్‌

Wednesday 20th February 2019
Markets_main1550659548.png-24263

  • 403 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌
  • 10735 వద్ద నిఫ్టీ

సూచీల తొమ్మిది రోజుల సుధీర్ఘర్యాలీ బుధవారం బ్రేక్‌ పడింది. మెటల్‌, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 403పాయింట్లు లాభంతో 35756 వద్ద, నిఫ్టీ 131 పాయింట్ల లాభంతో 10735.50 వద్ద స్థిరపడ్డాయి. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 290 పాయింట్ల పెరిగి 26,955 వద్ద ముగిసింది. ప్రపంచమార్కెట్ల సానుకూల ర్యాలీని మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. మార్కెట్‌ వరుస పతనంతో షేర్లు కనిష్టస్థాయిల్లో ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకే కట్టుబడ్డారు. దీంతో ట్రేడింగ్‌ చివరకు వరకు సూచీలు స్థిరమైన ర్యాలీని కొనసాగించాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు పరిష్కారం అవ్వచ్చనే అంచనాలతో నేడు ఆసియా మార్కెట్లు లాభాల ముగింపు, యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం, చివరి అరగంటలో ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌కు దిగడం తదితర అంశాలు సూచీల భారీ లాభాలకు కారణమయ్యాని చెప్పవచ్చు. ఇంట్రాడే సెన్సెక్స్‌ ఇంట్రాడేలో  455 పాయింట్లు లాభపడి 35,797 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 10,752.70 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది. 
హిందాల్కో, అదానీపోర్ట్స్‌, వేదాంత, టాటాస్టీల్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్స్‌ఫైనాన్స్‌ షేర్లు 4శాతం నుంచి 6శాతం ర్యాలీ చేయగా, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, జీ లిమిటెడ్‌, హిందూస్థాన్‌యూనిలివర్‌, హీరోమోటోకార్ప్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు స్వల్పంగా అరశాతం నష్టపోయాయి.



You may be interested

వ్యాల్యూ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో కొత్త స్టాక్స్‌

Wednesday 20th February 2019

వ్యాల్యూ ఇన్వెస్టర్లు, ప్రముఖ ఇన్వెస్టర్లుగా పేర్కొనే డాలీఖన్నా, ఆశిష్‌ కచోలియా, పొరింజు వెలియాత్‌ వంటి వారి పోర్ట్‌ఫోలియోలోకి కొత్తగా కొన్ని స్టాక్స్‌ వచ్చి చేరాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో మార్కెట్‌ డేటా ఆధారంగా ఈ వివరాలు వెలుగు చూశాయి. ఓ కంపెనీలో ఒక శాతానికి పైగా వాటాలున్న సాధారణ ఇన్వెస్టర్ల వివరాలను కంపెనీలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ ప్రకారం చూస్తే ఏస్‌ ఇన్వెస్టర్ల చేతికి చిక్కిన స్టాక్స్‌ వివరాలు ఇవి...   అన్సాల్‌ బిల్డ్‌వెల్‌ కోచికి

10650పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 20th February 2019

ప్రపంచమార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ స్టాక్‌మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 213 పాయింట్ల లాభంతో 35,565 వద్ద, నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 10650 పైన 10,655 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వరుసగా 9రోజుల పాటు నష్టాలతో అతలాకుతలమైన మార్కెట్లో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు షార్ట్‌ కవరింగ్‌ చేస్తున్నారు. ఫలితంగా అన్ని ప్రధాన రంగ షేర్లలో కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌,

Most from this category