STOCKS

News


11600 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 22nd April 2019
Markets_main1555929279.png-25274

బలహీన దేశీయ సంకేతాలకు తోడు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ల పతనంతో సోమవారం మార్కెట్‌ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్‌ 495 పాయింట్ల నష్టంతో 38,645 వద్ద, నిఫ్టీ 158 పాయింట్ల నష్టంతో 11,594.50 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల భారీ పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 540(1.75శాతం) నష్టపోయి 29,688 వద్ద స్థిరపడింది. సూచీలకు ఇది వరుసగా రెండో రోజూ నష్టాల ముగింపు. ఈ వారంలో పలు కీలక కంపెనీలు  క్యూ4 ఫలితాలను ప్రకటించనుండంతో పాటు రేపు(మంగళవారం) పలు రాష్ట్రాల్లో​ 3వ విడతలో భాగంగా 116 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తతవహిస్తున్నారు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 21పైసలు క్షీణత కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరించింది. మరోవైపు ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కంపెనీల ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోవడంతో రిలయన్స్‌ ఇండస్టీ‍్రస్‌ 3శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 1.50శాతం నష్టపోయి సూచీలను భారీ పతననానికి కారమమయ్యాయి. అలాగే ఇరాన్‌ నుంచి దిగుమతి అవుతున్న క్రూడాయిల్‌ పై సుంకాలు విధింపునకు సిద్ధమవుతున్నట్లు అమెరికా ప్రకటనతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 6నెలు గరిష్టానికి చేరుకోవడం కూడా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. రూపాయి బలహీనతతో ఒక్క ఐటీ షేర్ల తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువలా సాగాయి. ఈ క్రమంలో నిఫ్టీ ఇండెక్స్‌ తనకు సాంకేతికంగా కీలకమైన 11600 స్థాయిని, సెన్సెక్స్‌ 39000ల స్థాయిని కోల్పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ సూచీ 38,585.65 - 39,158.22 రేంజ్‌లో ట్రేడవ్వగా, నిఫ్టీ 11,583.95 - 11,727.05 స్థాయిలో కదలాడింది.
ఐఓసీ, ఇండస్‌ ఇండ్‌, బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 4శాతం నుంచి 9శాతం నష్టపోగా, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, టెక్‌మహీం‍ద్రా, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి.You may be interested

లార్జ్‌క్యాప్స్‌ను నమ్ముకోండి!

Monday 22nd April 2019

ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ కన్నా లార్జ్‌క్యాప్స్‌ను నమ్ముకోవడం మంచిదని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈక్విటీ హెడ్‌ జినేశ్‌ గోపాని సూచించారు. స్థూల ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, మైక్రో ఎకానమీలో ఆటుపోట్లు కనిపిస్తున్న నేపథ్యంలో పెద్దస్టాకులతోనే క్యాపిటల్‌కు రక్షణ ఉంటుందన్నారు. ఎకానమీ మెరుగుపడితే అప్పుడు చిన్న కంపెనీల ఎర్నింగ్స్‌ మెరుగుపడతాయని, అప్పుడు వాటి గ్రోత్‌ లార్జ్‌క్యాప్స్‌ కన్నా ఎక్కువగా ఉంటుందని, అలాంటప్పుడు వీటిపై కన్నేయవచ్చని సూచించారు. కానీ ప్రస్తుతం మాత్రం

బాండ్లపై ఎఫ్‌ఐఐల అనాసక్తి

Monday 22nd April 2019

దేశీయ ఈక్విటీలపై మక్కువ చూపుతున్న విదేశీ సంస్థాగత మదుపరులు దేశీయ బాండ్‌ మార్కెట్‌పై శీతకన్నేస్తున్నారు. ఒకపక్క ఈక్విటీల్లో ఇబ్బడిముబ్బడిగా కొనుగోళ్లు చేస్తున్న ఎఫ్‌ఐఐలు డెట్‌ మార్కెట్లో నికర విక్రేతలుగా మారారు. ఈ నెల్లో ఇంతవరకు అంతర్జాతీయ ఫండ్స్‌ సావరిన్‌, కార్పొరేట్‌ బాండ్స్‌ నుంచి రూ. 8950కోట్ల రూపాయలు ఉపసంహరించుకున్నారని ఎన్‌ఎస్‌డీ డేటా చెబుతోంది. మార్చిలో విదేశీ ఫండ్స్‌ బాండ్‌ మార్కెట్లో దాదాపు 17వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపారు. ఉన్నట్లుండి

Most from this category