STOCKS

News


లాభాల స్వీకరణ-సెన్సెక్స్‌ 222 పాయింట్లు డౌన్‌

Friday 22nd March 2019
Markets_main1553250131.png-24756

11500 దిగువన ముగిసిన నిఫ్టీ
222 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌

ఏడురోజుల సుధీర్ఘర్యాలీ అనంతరం మార్కెట్‌లో శుక్రవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. నిఫ్టీ 11500 మార్కును కోల్పోగా, సెన్సెక్స్‌ 222 పాయింట్ల మేర నష్టపోయింది. అటో, ఐటీ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్‌ 222 పాయింట్ల నష్టపోయి 38164 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు క్షీణించి 11457 వద్ద స్థిరపడ్డాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ నేడు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్‌ గత ముగింపు(38,386)తో పోలిస్తే 178 పాయింట్లు లాభపడి 38,564.71 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 11,572.80 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే, సూచీలు వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, ఫిచ్‌ రేటింగ్స్‌  భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించడటం, అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంక్‌  ఆందోళన వ్యక్తం చేయడటం, పెరిగిన ముడిచమురు ధరలు, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలు దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా, రియల్టీ రంగ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 11,434.55 - 11,572.80 స్థాయిలో ట్రేడవ్వగా, సెన్సెక్స్‌ 38,089.36 - 38,564.71 రేంజ్‌లో కదలాడింది. 
30,000ల మార్కును అందుకున్న బ్యాంక్‌ నిఫ్టీ:- 
నేటి ఇంట్రాడేలో బ్యాంక్‌ నిఫ్టీ తొలిసారిగా 30000 మార్కును అందుకుంది. ప్రైవేట్‌ రంగ షేర్లైన యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ ఇందుకు తోడ్పాటు అందించింది. గత 8రోజులుగా ర్యాలీ చేస్తున్న బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ వరుసగా తొమ్మిదో రోజూ 29,920.75ల లాభాల్లోనే ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌,  ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడటంతో ఇంట్రాడేలో 175 పాయింట్లు(0.60శాతం) లాభపడి 30008 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. మూడో త్రైమాసికంలో బ్యాంక్‌ కంపెనీలు మంచి ఫలితాలను నమోదు చేయవచ్చనే అశావహనంతో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడ్డారు. అనంతరం మార్కెట్‌లో జరిగిన లాభాల స్వీకరణలో భాగంగా ఈ సూచి 250 పాయింట్లు (0.85శాతం) నష్టపోయి 29,582.50 వద్ద స్థిరపడింది.
ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, టాటామోటర్స్‌, ఇన్ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌ షేర్లు 2.50శాతం నుంచి 3శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఏషియన్‌ పేయింట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌టీపీసీ షేర్లు 1శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి.You may be interested

రిటైల్ ఇం'ధనం'పై దిగ్గజాల దృష్టి

Saturday 23rd March 2019

- భారత్ మార్కెట్‌పై విదేశీ సంస్థల ఆసక్తి - పెద్ద సంఖ్యలో రిటైల్‌ ఔట్‌లెట్స్‌ ఏర్పాటుపై కసరత్తు - ఆదానీ గ్రూప్‌తో ఫ్రాన్స్‌ టోటల్‌ జట్టు - ఎస్సార్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసిన రాస్‌నెఫ్ట్‌ - 3,500 ఔట్‌లెట్స్‌ ఏర్పాటుకు బీపీకి లైసెన్సులు           దేశీయంగా ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజ ఆయిల్‌ కంపెనీలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయి. ఇంధన రిటైలింగ్‌ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పోటీపడుతున్నాయి. ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ ఎస్‌ఏ

ఆర్‌బీఐ నిర్ణయంతో మరో ఎన్‌పీఏల షాక్‌?

Friday 22nd March 2019

ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిస్టుల అంచనా బలహీనమైన కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తిరిగి రుణాలిచ్చేందుకు అంగీకరిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆక్స్‌ఫర్డ్‌ ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయం సరైన ఆలోచనతో తీసుకున్నది కాదని వ్యతిరేకించారు. ఈ నిర్ణయంతో మరలా వ్యవస్థలో మొండి బకాయిలు పెరుగతాయని, ఈ దఫా వీటి పెరుగుదల అసమాన్యంగా ఉంటుందని హెచ్చరించారు. ఎకానమీలో లిక్విడిటీ పెంచేందుకని చెబుతూ ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ బలహీన పీఎస్‌బీలు రుణాలిచ్చేందుకు అనుమతినిచ్చారు.

Most from this category