News


గరిష్టస్థాయిలో అమ్మకాలు...నష్టాల ముగింపు

Wednesday 27th March 2019
Markets_main1553682547.png-24831

100 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌
11450 పాయింట్ల దిగువకు నిఫ్టీ

మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అమ్మకాలతో మార్కెట్‌ లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. ఫార్మా, అటో, ఇంధన, ఎఫ్‌ఎంజీసీ రంగ షేర్లతో పతనంతో సెన్సెక్స్‌ 100 పాయింట్లు నష్టపోయి 38,133 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు క్షీణించి 11450 మార్కును కోల్పోయి 11,445 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం లాభపడి 30,020 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌, మీడియా, మెటల్‌ షేర్లు స్వల్పంగా లాభపడగా మిగత అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాలతో ముగిశాయి. 
475 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పతనం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి తగ్గుదల లాంటి సానుకూలాంశాలతో నేడు దేశీయ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 138 పాయింట్ల లాభంతో 38,372 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 11,532 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్లకు మద్దతునివ్వడంతో సూచీలు సజావుగా ర్యాలీ చేశాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక, మెటల్‌ రంగ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలిచింది. ముఖ్యంగా  ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లకు నేటి ట్రేడింగ్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 243 పాయింట్లు పెరిగి 38,476 వద్ద, నిఫ్టీ 63పాయింట్లు లాభపడి 11,546 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్‌లో అ‍మ్మకాలు ప్రారంభమయ్యాయి. రేపు మార్చి ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ సీరిస్‌ ముగింపు ఉండటం, , ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు తప్ప అన్ని ప్రధాన మార్కెట్లు నష్టాల ముగియడం, యూరప్‌ మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించడం తదితర అంశాలు మన మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో నేపథ్యంలో ఇన్వెస్టర్లు  అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా సెన్సెక్స్‌ డే హై(38,476) నుంచి 475 పాయింట్లు నష్టపోయి 38,001 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని, నిఫ్టీ సూచీ ఇంట్రాడే గరిష్టం(11,546.20) నుంచి 113 పాయింట్లు నష్టపోయి 11,413 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే చివరి అరగంట కొనుగోళ్లుతో సూచీలు కొంతమేర రికవరీ అయ్యాయి. 
-    దివీస్‌ ల్యాబ్స్‌, కేడిల్లా, సన్‌ఫార్మా లాంటి అధిక వెయిటేజీ కలిగిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ అత్యధికంగా నష్టపోయింది. లుపిన్‌, బయోకాన్‌ షేర్ల పతనం సైతం ఇండెక్స్‌ నష్టపోవడానికి కారణంగా నిలిచాయి.
-    యాంటీ శాటిలైట్ (A SAT) మిస్సైల్ ద్వారా ఎల్ఈవో(లోయ‌ర్ ఎర్త్ ఆర్బిట్) ఉప‌గ్రహాన్ని నేల‌కూల్చి, అ‍గ్రరాజ్యాలైన అమెరికా, చైనా, రష్యాల దేశాల సరసన భారత్‌ నిలిచిందని ప్రధాని మోదీ ప్రకటనతో డిఫెన్స్‌ స్టాకులు ర్యాలీ చేశాయి. హిందూస్థాన్‌ ఏరోనాటికల్స్‌, బీఈఎల్‌, భారత్‌ డైనమిక్స్‌ షేర్లు 3శాతం లాభపడ్డాయి.
-    జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏప్రిల్‌ చివరినాటికి  రద్దు చేయబడిన మరో 40 విమానాలు పునఃప్రారంభమవుతాయని వార్తల నేపథ్యంలో ఈ కంపెనీలు షేర్లు నేటి ఇంట్రాడేలో 10వారాల గరిష్టాన్ని తాకింది. చివరికి 2.50శాతం లాభంతో రూ.277.15ల వద్ద స్థిరపడింది. 
-     ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల ర్యాలీ చేయడంతో ఇంట్రాడేలో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ కొత్త రికార్డు హైని నమోదు చేసింది. ఉదయం ట్రేడింగ్‌లో 1.25శాతం(380 పాయింట్లు)ర్యాలీ చేసి 30262.55 వద్ద కొత్త రికార్డు హై నెలకొల్పింది. చివరికి అరశాతం లాభంతో 30,019 వద్ద ముగిసింది.

ఐషర్‌మోటర్స్‌, భారతీఎయిర్‌టెల్‌, టాటామోటర్స్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టపోగా, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, ఇండస్‌ ఇండ్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 6శాతం లాభపడ్డాయి. 



You may be interested

కంపెనీ బలాలు శాశ్వతమేమీ కాదు..!

Wednesday 27th March 2019

ఓ కంపెనీకి ఉన్న ఉత్పత్తులు లేదా సేవల విశిష్టతను చూసి ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? మీ నిర్ణయం మంచిదే. కానీ, ఈ బలాలు శాశ్వతం కాదన్న విషయాన్ని కూడా గుర్తించాలి. ఓ కంపెనీకి ప్రత్యేక బలాలు ఉన్నాయంటే అధిక ఆదాయార్జన, అధిక మార్జిన్లకు అవకాశం ఉన్నట్టు. కనుక ఈ బలాలను చూసి ఇన్వెస్ట్‌ చేసే వారు, ఆ తర్వాత కూడా వీటిని క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలని నిపుణుల సూచన. మార్కెట్‌

అవకాశముంటే మళ్లీ వస్తా!

Wednesday 27th March 2019

రఘురామ్‌ రాజన్‌ భారత్‌లో తనకు తగిన అవకాశం ఉందని, తన అవసరం ఉందని భావిస్తే తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‍ప్రభుత్వం ఏర్పడితే రాజన్‌కు ఆర్థిక శాఖ ఇస్తారన్న ఊహాగానాల నడుమ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా రెండో దఫా కొనసాగేందుకు ఆయనకు బీజేపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ప్రస్తుతం ఆయన చికాగో యనివర్సిటీ బూత్‌

Most from this category