STOCKS

News


స్వల్ప లాభాలతో ముగింపు

Friday 6th July 2018
Markets_main1530873080.png-18081

  • 10800 దిగువకు నిఫ్టీ

ముంబై:- అటో, ఐటీ, ఆయిల్‌రంగ షేర్ల అండతో మార్కెట్‌ శుక్రవారం స్వల్పలాభంతో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 83 పాయింట్ల లాభంతో 35,658 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 10,773 పాయింట్ల వద్ద ముగిశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌పీసీఎల్‌, టాటా మోటర్‌ ర్యాలీ సూచీలను లాభాల పట్టించింది. అటో, ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకు, రియాల్టీ రంగ సూచీలు లాభాల్లో ముగియగా, మిగతా అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. కీలకమైన బ్యాంక్‌ ఇండెక్స్‌ 9 పాయింట్లు నష్టపోయి 26,494 వద్ద ముగిసింది.
నేడూ నష్టాలతో ప్రారంభం:-
అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడం, మన మార్కెట్‌ ప్రారంభ సమయానికి ఆసియాలోని పలు మార్కెట్లు నష్టాల ట్రేడింగ్‌, డాలర్‌తో రూపాయి మారకం  జీవితకాల కనిష్టానికి చేరుకోవడం వంటి ప్రతికూల అంశాల నడుమ నేడు దేశీయ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభంమైంది. సెన్సెక్స్‌ 31 పాయింట్ల నష్టంతో 35544 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో  10,744 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
లాభాల్లోకి మార్కెట్‌:-
మార్కెట్‌ నష్టాలతోనే ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఓఎన్‌జీసీ, కోటక్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ వంటి హెవీ వెయిట్‌ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ తిరిగి లాభాల్లోకి మళ్లింది. అనంతరం వెలుగులోకి వచ్చిన ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల ర్యాలీ అండతో సూచీలు మరిన్ని లాభాలను ఆర్జించాయి. ఈ క్రమం‍లోనే సెన్సెక్స్‌ 225 పాయింట్ల లాభంతో 35800 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో  10,816 వద్ద ఇంట్రాడే హైని నమోదుచేశాయి.

చివర్లో కొనుగోళ్లు:-
సూచీలు గరిష్టస్థాయిలో ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో సూచీలు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ చివరి గంటలో అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు ఇంట్రాడే ఆర్జించిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో నిఫ్టీ సూచీ 10800 స్థాయిని కోల్పోయి 10,773 వద్ద, సెన్సెక్స్‌ 35,658 పాయింట్ల వద్ద స్థిరపడింది.

డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, ఇన్ఫ్రాటెల్‌, టెక్‌మహీంద్రా షేర్లు 1నుంచి 2.50శాతం నష్టపోగా, టీసీఎస్‌, గ్రాసిం, టాటామోటర్స్‌, హీరోమోటర్స్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 2నుంచి 4.50శాతం లాభపడ్డాయి.



You may be interested

ఎంఎ‌స్‌పీ పెంపు ఈ 11 షేర్లకు బూస్ట్‌..!

Friday 6th July 2018

ముంబై: రైతుల ఆదాయం మెరుగుపరచడంలో భాగంగా ఖరీఫ్‌ సీజన్‌లో పండే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎ‌స్‌పీ)ను కేంద్ర ప్రభుత్వం పెంచగా.. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల ఆదాయం పెరుగుతుందని పలు బ్రోకింగ్‌ సంస్థలు అంటున్నాయి. అయితే ఇదే సమయంలో 20 బేసిస్‌ పాయింట్ల మేర ద్రవ్య లోటు భారం పెరగనుందని వెల్లడించాయి. వేసవి పంటలకు 4-53 శాతం వరకు ఎంఎస్‌పీ పెంపు ప్రకటించగా.. ఈ నిర్ణయం

గడిచిన మూడు నెలల్లో మేం కొన్న షేర్లివే...

Friday 6th July 2018

టీసీజీ ఏఎమ్‌సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముంబై: గడిచిన మూడు నెలల్లో ఎల్ అండ్ టీ, మాగ్మా ఫిన్‌కార్ప్‌, డాక్టర్ రెడ్డీస్ షేర్లను పడిపోయినసమయంలోనే కొనుగోలు చేసినట్లు టీసీజీ ఏఎమ్‌సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చక్రి లోకప్రియ తెలిపారు. ఇతర లార్జ్‌క్యాప్‌ కంపెనీలతో పోల్చితే ఎల్ అండ్ టీ అనుకున్నంత స్థాయిలో పనితీరును కనబర్చకపోవడం వల్లనే ఈ షేరు తగ్గిందని వివరించారు. మాగ్మా ఫిన్‌కార్ప్‌ నిధులు సమీకరించగా ఈ సంస్థలో తాము క్యూఐపీ మార్గంలో

Most from this category