STOCKS

News


10500 దిగువకు నిఫ్టీ

Monday 12th November 2018
Markets_main1542018820.png-21910

  • 345 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అమ్మకాలు క్రమంగా పెరగడంతో మార్కెట్‌ వరుసగా రెండో సెషన్‌లోనూ భారీ నష్టంతో ముగిసింది. ప్రభుత్వరంగబ్యాంక్‌, అటో, మెటల్‌ షేర్లలో పతనంతో సెన్సెక్స్‌ 345 పాయింట్ల నష్టంతో 34,813 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల నష్టంతో 10,482 వద్ద ముగిశాయి. నేటి ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ..,  కీలకమైన రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఫలితంగా సూచీలు మిడ్‌సెషన్‌ వరకు పరిమిత శ్రేణిలో కదలాడాయి. మిడ్‌సెషన్‌ అనంతరం మార్కెట్లో అమ్మకాలు గంట గంటకు పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌, మెటల్‌ షేర్లలో అమ్మకాలు జరిగాయి. పలితంగా సెన్సెక్స్‌ 35 వేల మార్కును, నిఫ్టీ 10500 మార్కును కోల్పోయాయి. డాలర్‌ మారకంలో రూపాయి పతనం కూడా నేటి మార్కెట్‌ నష్టాల ముగింపు కారణమని చెప్పవచ్చు. ఎన్‌ఎస్‌ఈలో ఒక్క ఐటీ సూచీ తప్ప అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా అటో ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. నిఫ్టీ సూచీ 10,464 - 10,645 రేంజ్‌లో కదలాడింది. సెన్సెక్స్‌ సూచీ 34,756.80 - 35,333.22 స్థాయిలో కదలాడింది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1శాతం నష్టపోయి 25,539.75 వద్ద ముగిసింది.
హిందాల్కో, హీరోమోటోకార్ప్‌, ఐఓసీ, టాటామోటర్స్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 4నుంచి 7శాతం నష్టపోయాయి. హెచ్‌సీఎల్‌, కోటక్‌ బ్యాంక్‌, టాటాస్టీల్‌, టెక్‌మహీంద్రా, టైటాన్‌ షేర్లు 1శాతం నుంచి 6శాతం లాభపడ్డాయి.



You may be interested

అక్టోబర్‌లో ఫండ్స్‌ అమ్మకాలు, కొనుగోళ్లు వీటిల్లోనే

Monday 12th November 2018

అక్టోబర్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కరెక్షన్‌కు గురైనాగానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.22.23 లక్షల కోట్లకు పెరిగింది. ఈ కాలంలో ప్రధాన సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయి. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మాత్రం ఆగలేదు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ ఈ రెండు నెలల్లో మార్కెట్లు కరెక్షన్‌ బాట పట్టగా... ఈ కాలంలో రూ.7,727 కోట్లు, రూ.7,985 కోట్ల మేర సిప్‌ ద్వారా మ్యూచువల్‌

యూనియన్‌ అభ్యర్థనతో కోల్‌ ఇండియా డౌన్‌

Monday 12th November 2018

ఒకటిన్నర శాతం పతనమై రూ.264 వద్ద ముగింపు కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సిఐఎల్‌) ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో బిడ్లు దాఖలు చేయవద్దని ఆ రంగ యూనియన్లు ఉద్యోగులను కోరాయి. ప్రైవేటు రంగానికి సంస్థను అప్పజెప్పే ప్రయత్నాలు కొనసాగుతున్నందున ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఈమేరకు కట్టుబడి ఉండాలని కోరింది. నవంబర్‌ 15న ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ప్రారంభంకానుండగా.. సంస్థ ఉద్యోగులకు 5 శాతం డిస్కౌంట్‌తో రూ.252.22 ధరకే 99,00,196 షేర్లను జారీ

Most from this category