STOCKS

News


మళ్లీ అమ్మకాలు...సెన్సెక్స్‌ 323 పాయింట్లు డౌన్‌

Thursday 25th April 2019
Markets_main1556188886.png-25347

 

  • 11650 దిగువున ముగిసిన నిఫ్టీ

క్రితం రోజు కదంతొక్కిన స్టాక్‌ సూచీలు గురువారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 323 పాయింట్లు నష్టపోయి 38,730.86 వద్ద, నిఫ్టీ 84.35 పాయింట్లు కోల్పోయి 11,642 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడిచమురు ధర ఈ ఏడాదిలో తొలిసారి 75డాలర్ల పైకి చేరడం, దేశీయ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 37 పైసలు కరిగిపోవడంతో పాటు చివరి గంట అమ్మకాలు వెల్లువెత్తి మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. నేడు ఏప్రిల్‌ డెరివేటివ్స్‌ ప్యూచర్‌ కాంట్రాక్టు ముగింపు తేది కావడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాంగ్‌ ఆఫ్‌లోడింగ్‌ జరపడం, వచ్చే సిరీస్‌కు రోలోవర్‌ చేయడంలో ఆసక్తి చూపకపోవడంతో మార్కెట్‌ భారీ నష్టంతో ముగిసింది. ఒక్క రియల్టీ ఇండెక్స్‌ మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు జరిగాయి. మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో విక్రయాలు అధికంగా జరగడంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1శాతం(300 పాయింట్లు) నష్టపోయి 29,561.35 వద్ద స్థిరపడింది. నేడు మార్కెట్‌ స్వల్పలాభంతో ప్రారంభమైనప్పటికి.., ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో కొంతసేపు లాభనష్టాల మధ్య ట్రేడయ్యాయి. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన గంట తర్వాత షార్ట్‌ కవరింగ్‌తో సూచీలు లాభాల బాటపట్టాయి. ఈ క్రమం‍లో సెన్సెక్స్‌ 207 పాయింట్లు లాభపడి 39,262.22 వద్ద, నిఫ్టీ 71పాయింట్లు పెరిగి 11,796.75ల వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. తదుపరి మిడ్‌ సెషన్‌ నుంచి మార్కెట్లో అమ్మకాలు క్రమంగా పెరగడంతో సూచీలు ఉదయం ట్రేడింగ్‌లో ఆర్జించిన లాభాలను కోల్పోయాయి. యూరప్‌ మార్కెట్ల మిశ్రమంగా ఓపెనింగ్‌తో పాటు చివరి గంటలో అమ్మకాల తీవ్రత పెరగడంతో సెన్సెక్స్‌ ఒకదశలో 390 పాయింట్లును కోల్పోయి 38,664 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయి 11,624.30 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.
హిందాల్కో, మారుతి, వేదాంత, టాటాస్టీల్‌, ఇన్ప్రాటెల్‌ షేర్లు 2శాతం నుంచి 9.50శాతం నష్టపోగా, బీపీసీఎల్‌, భారతీఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసీం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు 2.50శాతం నుంచి 5.50శాతం లాభపడ్డాయి.



You may be interested

ఈ స్టాక్స్‌పై ప్రమోటర్లు, ఎఫ్‌పీఐలు, డీఐఐల మక్కువ

Friday 26th April 2019

రిటైల్‌ ఇన్వెస్టర్లు ఏ స్టాక్స్‌ను ఎంచుకోవాలన్న మీమాంసతో ఉంటే, అటువంటి వారు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి. ఓ కంపెనీలో ప్రమోటర్లు వాటా పెంచుకుంటే అది సానుకూల సంకేతమే అవుతుంది. అలాగే, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు(డీఐఐలు) సైతం ఓ కంపెనీలో వాటాలు పెంచుకుంటున్నారంటే ఆ కంపెనీ భవిష్యత్తు వ్యాపార వృద్ధి అవకాశాలపై స్పష్టమైన అవగాహనతో ఆ పని చేస్తున్నట్టుగానే భావించాలి. అలా చూసినప్పుడు 12

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం డౌన్‌

Thursday 25th April 2019

ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో నెలకొన్న అమ్మకాలతో బ్యాంకు నిఫ్టీ గురువారం ట్రేడింగ్‌లో 1 శాతం(320 పాయింట్లు) నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ 29,927.05ల వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో షార్ట్‌ కవరింగ్‌లో భాగంగా బ్యాంకింగ్‌ షేర్లు లాభపడంతో ఇండెక్స్‌ 0.75శాతం(200 పాయింట్లు) జంప్‌చేసి 30057.70ల గరిష్టానికి చేరుకుంది. అయితే మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్‌లో మొదలైన అమ్మకాలతో ఇండెక్స్‌ ఆర్జించిన లాభాలన్నింటిని కోల్పోయి నష్టాల బాట

Most from this category