STOCKS

News


11900పైన నిఫ్టీ ముగింపు

Monday 10th June 2019
Markets_main1560162989.png-26208

  • ఆదుకున్న చివరి అరగంట కొనుగోళ్లు

సూచీలు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీ లాభాలను నమోదు చేసుకున్నా...మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అమ్మకాలు సూచీల లాభాల్నికొంతవరకూ  హరించివేశాయి. ఒకదశలో సూచీలు నష్టాల్లోకి మళ్లినప్పటికీ, చివరి అరగంటలో జరిగిన షార్ట్‌ కవరింగ్‌తో సెన్సెక్స్‌ 168 పాయింట్ల లాభంతో 39,784.52 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 11,922 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా, రియల్టీ, అటో, మెటల్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్‌ షేర్ల పతనంతో బ్యాంక్‌ నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 31,034.00 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న సూచీలు భారీ లాభంతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 316 పాయింట్ల లాభంతో 39,930 పాయింట్ల వద్ద, నిఫ్టీ 93 పాయింట్ల పెరిగి 11,963 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. సూచీలు భారీ లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.., ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్ల అమ్మకాల కారణంగా సూచీల లాభాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. మిడ్‌సెషన్‌ అమ్మకాల తీవ్రత మరింత ఎక్కువ కావడంతో సెన్సెక్స్‌ ఒక దశలో గరిష్ట స్థాయి నుంచి (39,979.48) 360 పాయింట్లను నష్టపోయి 39,620 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. నిఫ్టీ ఇండెక్స్‌ గరిష్టస్థాయి(11,975.05) నుంచి 108 పాయింట్లను కోల్పోయి 11,871.75 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అయితే మార్కెట్లో చివరి అరగంటలో ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు జరగడంతో సూచీల మళ్లీ లాభాలను ఆర్జించగలిగాయి.
ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, బ్రిటానియా షేర్లు 2శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. ఐఓసీ,, గెయిల్‌, కోల్‌ ఇండియా, యస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌ షేర్లు 1.50శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. 



You may be interested

యాక్సిస్‌ నుంచి టాప్‌ రికమండేషన్లు

Monday 10th June 2019

మిడ్‌టర్మ్‌ కోసం యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ నాలుగు స్టాకులను రికమండ్‌ చేస్తోంది. 1. టాటా గ్లోబల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 266. స్టాప్‌లాస్‌ రూ. 242. వీక్లీ చార్టుల్లో దీర్ఘకాలిక నిరోధ శ్రేణి రూ. 246- 248ను ఛేదించింది. ఈ బ్రేకవుట్‌కు మంచి వాల్యూం మద్దతు కూడా దొరికింది. ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ ఇండికేటర్లు పాజిటివ్‌గా కదలాడుతున్నాయి. ప్రస్తుతం స్టాకు తన 20, 50, 100 రోజుల డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతూ బలంగా

మొండిపద్దులంటే ఐసీయూ పేషెంట్లే!

Monday 10th June 2019

పట్టించుకోకపోతే మరింత నష్టం  ఎస్‌బీఐ చీఫ్‌ రజనీశ్‌ కుమార్‌ వ్యవస్థలో మొండిపద్దులు ఐసీయూలో పేషెంట్‌ లాంటివని ఎస్‌బీఐ చీఫ్‌ రజనీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. వాటిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే అప్పుతీసుకున్నవాళ్లనే కాక, ఇచ్చిన సంస్థకు కూడా ఇక్కట్లు తెస్తాయన్నారు. ఫిబ్రవరి 12 సర్క్యులర్‌పై ఆర్‌బీఐ చేసిన తాజా సవరణలు అటు చిన్న, ఇటు పెద్ద బ్యాంకులకు సాయం చేస్తాయన్నారు. మొండిపద్దుల పరిష్కారానికి తీసుకువచ్చిన పాత నిబంధనలను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో తాజాగా

Most from this category