News


11650పైన నిఫ్టీ ముగింపు

Tuesday 9th April 2019
Markets_main1554806345.png-25037

రాణించిన ప్రైవేట్‌రంగ షేర్లు

బ్యాంకింగ్‌, అటో రంగ షేర్ల ర్యాలీ అండతో మంగళవారం మార్కెట్‌  భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 238 పాయింట్లను ఆర్జించి 38939 వద్ద, నిఫ్టీ 67.50 పాయింట్లు లాభపడి 11,650పైన 11,672 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 268 పాయింట్లు లాభపడి 30,113 వద్ద ముగిసింది.  డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడటం, రూపాయి రీకవరీ కావడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నుంచి అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ నేడు మార్కెట్‌ స్వల్పలాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 38,730 వద్ద, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,612 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్నటి రోజు మార్కెట్‌ నష్టాల ముగింపు, కార్పోరేట్‌ ఫలితాల వెల్లడి ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర కారణాలతో సూచీలు మిడ్‌సెషన్‌ వరకూ లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. అయితే మిడ్‌ సెషన్‌ నుంచి బ్యాంకింగ్‌, అటో, ఐటీ, మెటల్‌ షేర్ల అనూహ్య కొనుగోళ్లతో సూచీలు నష్టాల్లోంచి లాభాల్లో మళ్లాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ సూచీల అండగా నిలిచాయని చెప్పవచ్చు. అలాగే యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 379 పాయింట్లు లాభపడి  38,979 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 11,684 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. చివరి వరకు కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సూచీలు నిన్నటి లాభాలను పూడ్చుకోగలిగి లాభాలతో ముగిశాయి. 
ఐసీఐసీఐ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, టాటామోటర్స్‌, విప్రో, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం లాభపడగా, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పేయింట్స్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు అరశాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు డౌన్‌

Wednesday 10th April 2019

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల కారణంగా బుధవారం భారత్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50  గంటలకు 40 పాయింట్ల నష్టంతో11,714 పాయింట్ల వద్ద కదులుతోంది. గత శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,764 పాయింట్ల వద్ద ముగిసింది.  అలాగే మంగళవారం రాత్రి అమెరికా సూచీలు అరశాతంపైగా క్షీణించాయి. తాజాగా ఆసియా సూచీలన్నీ అరశాతం వరకూ నష్టాలతో ట్రేడవుతున్నాయి.

ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ భారీగా పెరిగిన షేర్లివే!

Tuesday 9th April 2019

ఎన్నికల తొలిదశ దగ్గరపడుతున్న సమయాన మార్కెట్లో అస్థిరత రూపుదాలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రెండ్‌ ఆధారిత ట్రేడింగ్‌ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్‌ సీరిస్‌లో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ బాగా పెరిగిన ఐదు షేర్లను రికమండ్‌ చేస్తున్నారు. 1. అంబుజా సిమెంట్‌: ఒపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 122.52 శాతం. టెక్నికల్‌ చార్టుల్లో బలహీనంగా కనిపిస్తోంది. రూ. 210 వరకు దిగిరావచ్చని అంచనా. నెగిటివ్‌ పాటర్న్‌ కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. 2. జెట్‌ ఎయిర్‌వేస్‌: ఒపెన్‌

Most from this category