STOCKS

News


ఆరో రోజూ ఆగని ర్యాలీ

Monday 18th March 2019
Markets_main1552906085.png-24671

మార్కెట్‌ లాభాల ర్యాలీ ఆగడం లేదు. వరుసగా ఆరోరోజూ లాభాలతో ముగిసింది. ఈ సోమవారం సెన్సెక్స్‌ 71 పాయింట్ల లాభంతో 38,095 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,462 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు రాణించడంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 214 పాయింట్లు లాభపడి 29,596  పాయింట్ల  వద్ద స్థిరపడింది. ఇంట్రాడే లో బ్యాంకింగ్‌, ఆర్థిక, ఫైనాన్స్‌, మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు అటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్‌ మారకంలో రూపాయి భారీగా బలపడటంతో ఐటీ షేర్లు నష్టపోయాయి. అలాగే ఫార్మా షేర్లు సైతం స్వల్పంగా నష్టపోయాయి.  ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న సూచీలు నేటి ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 108 పాయింట్లు పెరిగి 38,133 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11474 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఫిభ్రవరిలో భారత్‌ వాణిజ్యలోటు భారీగా తగ్గిందని గణంకాలు వెలువడటం, తద్వారా నేడు డాలరు మారకంలో రూపాయి బలపడటం, అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై సరళ వైఖరి అవలంబించవచ్చనే మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అటో, ఫార్మా. ఐటి షేర్లకు తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభమైన గంటలోనే సెన్సెక్స్‌ 345 పాయింట్లు బలపడి 38,369 వద్ద, నిఫ్టీ 103 పాయిం‍ట్లు పెరిగి 11530ల వద్ద ఇంట్రాడే వద్ద గరిష్టస్థాయిలను నమోదు చేశాయి. అనంతరం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, రూపాయి బలపడటంతో ఐటీ షేర్ల పతనం సూచీల ఆరంభ లాభాల్ని హరించివేశాయి. ఒకదశలో సెనెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(38,369) నుంచి 417 పాయింట్లను నష్టపోయి 37952 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అలాగే నిఫ్టీ సైతం ఇంట్రాడే గరిష్టం(11,530) నుంచి 117 పాయింట్లను నష్టపోయి 11,412 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అయితే చివరి గంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు తమ నష్టాలను పూడ్చుకోగలిగాయి. అలాగే మన మార్కెట్‌ ముగింపు సమయానికి యూరప్‌ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్‌ సూచీలను లాభాల ముగింపు కారణమైంది.
యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్లు 2.50శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి.  ఐషర్‌మోటర్స్‌, భారతీఎయిర్టెల్‌, విప్రో, హీరోమోటోకార్ప్‌, మారుతీ సుజుకీ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి.



You may be interested

రాణించిన రియల్టీ షేర్లు

Monday 18th March 2019

రియల్టీరంగ షేర్లు సోమవారం రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ 16శాతం లాభపడింది. బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 7శాతం పెరిగింది. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఐబీరియల్‌ఎస్టేట్‌ షేర్లు 4శాతం ర్యాలీ చేశాయి. శోభ, ఓబేరాయ్‌ రియల్టీ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. మహీంద్రా లైఫ్‌, సన్‌టెక్‌ షేర్లు స్వల్పంగా అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఫోనెక్స్‌ లిమిటెడ్‌, డీఎల్‌ఎఫ్‌

29,650 వద్ద బ్యాంకునిఫ్టీ కన్సాలిడేషన్‌?!

Monday 18th March 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తూ బ్యాంకు నిఫ్టీ అనూహ్య ర్యాలీ జరుపుతోంది. ఈ వారంకూడా బలంగా ఆరంభించి 29500 పాయింట్ల పైన ముగిసింది. ఎఫ్‌పీఐలు మార్కెట్లో అత్యంత చురుగ్గా ఉండడంతో సూచీల్లో బుల్స్‌ కదం తొక్కుతున్నాయి. గత రెండేళ్లుగా ఎఫ్‌ఐఐలు స్తబ్దుగా ఉండడం లేదా నికర అమ్మకాలు జరపడం చేశాయి. కానీ గత 10-12 రోజుల్లో ఎఫ్‌ఐఐలు 25వేల కోట్ల రూపాయలను మార్కెట్లో కుమ్మరించారు. గత అక్టోబర్‌లో ఎఫ్‌ఐఐలు

Most from this category