News


మార్కెట్‌ హైజంప్‌...6 నెలల గరిష్టం వద్ద ముగింపు

Monday 11th March 2019
Markets_main1552300373.png-24534

దేశవ్యాప్తంగా మొదలైన ఎన్నికల సందడి స్టాక్‌ మార్కెట్‌లోనూ నెలకొంది. కేంద్రంలో తిరిగి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడవచ్చనే అంచనాలతో పాటు కీలక అవరోధ స్థాయిలను సూచీలు అధిగమించడంతో సూచీలు సోమవారం పరుగులు పెట్టాయి.  సెన్సెక్స్‌ 383 పాయింట్లు పెరిగి 37,054 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 141 పాయింట్లు లాభపడి 11,176 వద్ద స్థిరపడ్డాయి. ఇంతటి గరిష్టస్థాయిలో ముగియడం ఆరునెలల తర్వాత ఇదే ప్రధమం. రూపాయి బలపడటంతో ఒక్క ఐటీ షేర్లు మిగతా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, అటో షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు ర్యాలీతో ఇంట్రాడేలో బ్యాంక్‌ నిఫ్టీ 28000ల స్థాయిని అధిగమించినప్పటికీ, చివరికి స్థాయిని నిలబెట్టుకోలేక 0.75శాతం లాభంతో 27,968.60 వద్ద స్థిరపడింది. 
ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 435 పాయింట్లు లాభపడి 37,106 వద్ద, నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 11,181 వద్ద ఇంట్రాడే గరిష్టాల నమోదు చేసింది. 
1.    మిడ్‌సెషన్‌ అనంతరం మొదలైన ఐరోపాలు మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయిల్‌, మైనింగ్‌ రంగ షేర్ల ర్యాలీ యూరప్‌ మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌కు తోడ్పాటును అందించింది. 
2.    నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను ఉరకలెత్తించేందుకు చైనా మరిన్ని ఆర్థిక ఉద్దీపనలను ప్రవేశపెట్టవచ్చనే అంచనాలతో పాటు అమెరికాతో చైనా వాణిజ్య చర్చలు సఫలం కావొచ్చనే అశలతో ఆసియాలో పలు మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 
3.    ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ పతనంతో పాటు దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ పెట్టుబడులు పెడుతుండటంతో సోమవారం ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ర్యాలీ చేసింది. నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ గత ముగింపు(70.15)తో పోలిస్తే 15పైసలు లాభంతో 70.01 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 33 పైసలు లాభపడి 70స్థాయిని దిగువన 69.82 వద్ద ఇంట్రాడే కనిస్టాన్ని ఏర్పాటు చేసింది. 

ఇన్ఫ్రాటెల్‌, ఐషర్‌మోటర్స్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 4.50శాతం నుంచి 8.50శాతం వరకూ లాభపడ్డాయి. టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్‌, జీ లిమిటెడ్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ షేర్లు అరశాతం నుంచి 1శాతం వరకూ నష్టపోయాయి.



You may be interested

ఎన్నికల ముందు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు 

Tuesday 12th March 2019

మరో నెల రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఆరంభం అవుతుండగా, ముందుగానే విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో కొనుగోళ్లను ఆరంభించారు. నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి వస్తారని, మరింత బలమైన ఆర్థిక సంస్కరణలు, పాలసీ సులభతరానికి అవకాశాలు ఉంటాయన్న అంచనాలే వారి పెట్టబడులకు కారణంగా అనలిస్టులు పేర్కొంటున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఫిబ్రవరిలో 2.42 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇది 15 నెలల గరిష్ట స్థాయి. 2018లో ఉన్న నికర

టాప్‌ ఎంఎఫ్‌లు ఫిబ్రవరిలో ఏం చేశాయి?

Monday 11th March 2019

ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి ఫిబ్రవరిలో నికర నిధుల ప్రవాహం గతేడాదితో పోలిస్తే 68 శాతం క్షీణించి రూ. 5122 కోట్లకు చేరాయి. దీంతో వరుసగా నాలుగో నెల సైతం ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి నిధులు తగ్గినట్లయింది. ప్రస్తుతం అన్ని ఎంఎఫ్‌ల ఏయూఎంల విలువ 23.16 లక్షల కోట్ల రూపాయలని ఏఎంఎఫ్‌ఐ డేటా వెల్లడించింది. గత నెల టాప్‌ 5 ఎంఎఫ్‌లు వేటిని కొని, వేటిని విక్రయించాయో చూద్దాం.. 1. హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌: ఈ ఫండ్‌ నిర్వహణలో

Most from this category