News


10850పైన నిఫ్టీ ముగింపు

Monday 25th February 2019
Markets_main1551090320.png-24323

ఐటీ, అటో ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ సోమవారం లాభంతో ముగిసింది. చివరి గంటలో కొనుగోళ్ల కారణంగా సూచీలు ఇంట్రాడే గరిష్టం వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 341 పాయింట్లు లాభపడి 36,213 వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 10,880 వద్ద స్థిరపడ్డాయి. ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 291 పాయింట్లు లాభపడి 27,159 వద్ద స్థిరపడింది. ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేడు సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆరంభం నుంచే కొనుగోళ్లకు మద్దతు లభించడంతో సూచీలు రోజంతా లాభాల్ని కొనసాగించాయి. ఫైనాన్స్‌, ప్రైవేట్‌ రంగ  బ్యాంకింగ్‌ షేర్లు మిడ్‌సెషన్‌ సెషన్‌ వరకు సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించగా, అనంతరం ఐటీ, అటో షేర్ల సూచీల ర్యాలీకి సూచీలను పరుగులు పెట్టించాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐటీ షేర్లు ర్యాలీ సూచీలకు ఎక్కువ లాభాల్ని ఆర్జించిపెట్టాయి.నిఫ్టీ -50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు (3శాతం లాభం) చోటు దక్కించుకున్నాయి. ఎక్కువగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో కొనుగోళ్లు  జరిగాయి. మిడ్‌సెషన్‌ సెషన్‌ అనంతరం యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం,  ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి.
నిఫ్టీ- 50 సూచీలో యస్‌ బ్యాంక్‌, గ్రాసీం, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, టీసీఎస్‌ షేర్లు 2.50శాతం నుంచి 3శాతం లాభపడగా పవర్‌ గ్రిడ్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇన్ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు అరశాతం నుంచి 8శాతం నష్టపోయాయి.



You may be interested

10 బీఎస్‌ఈ కంపెనీల నికర లాభం రెట్టింపు

Tuesday 26th February 2019

డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాల సీజన్‌ ముగిసింది. నిఫ్టీ-50 విక్రయాలు, ఎబిట్డా, పన్ను అనంతరం లాభాలు 19 శాతం, 2.3 శాతం, ఒక శాతం చొప్పున పెరిగాయి. ముఖ్యంగా లాభాల్లో త్రైమాసికం వారీగా, వార్షికంగా మంచి పనితీరు చూపించిన స్టాక్స్‌ కొన్ని ఉన్నాయి. అవి ఏసీసీ, యాక్సిస్‌ బ్యాంకు, బీఈఎంఎల్‌, భారత్‌ డైనమిక్స్‌, గుజరాత్‌ గ్యాస్‌, ఐనాక్స్‌ లీజర్‌, షాపర్స్‌ స్టాప్‌, సుందరం క్లేటాన్‌. మరి ఈ స్టాక్స్‌ను ప్రస్తుత సమయంలో

2–3 వారాలకు ఈ షేర్లు చూడొచ్చు

Monday 25th February 2019

2–3 వారాల్లో రాబడులకు అవకాశం వున్న   షేర్లపై వివిధ అనలిస్టులు రూపొందించిన అంచనాలివే.. అనలిస్ట్‌: వైశాలి ఫారిఖ్, టెక్నికల్‌ అనలిస్ట్, ప్రభుదాస్‌ లీలాధర్‌ హీరో మోటో కార్ప్‌ సిఫార్సు: బై,  టార్గెట్‌: రూ. 2950, స్టాప్‌లాస్‌: రూ. 2650  ఈ షేరు ఇటీవల 2,960 గరిష్టస్థాయి నుంచి పీకవుట్‌ అయిన తర్వాత రూ. 2,580 వరకూ తగ్గింది. అయితే ఈ కనిష్టస్థాయి వద్ద డెయిలీ చార్టుల్లో డబుల్‌ బాటమ్‌ ఫార్మేషన్‌ను కనపర్చి, బుల్లిష్‌ క్యాండిల్‌

Most from this category