STOCKS

News


10,650 పైన నిఫ్టీ

Friday 16th November 2018
Markets_main1542363369.png-22102

  • రాణించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం

సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో దేశీయ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ముగిసింది. నేడు ట్రేడింగ్‌లో కూడా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం, ఆసియా మార్కెట్ల మిశ్రమ ముగింపు, ఐరోపా మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ సూచీలకు కలిసొచ్చాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 71.71 స్థాయికి బలపడటంతో సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ముఖ్యంగా స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లో హెవీ వెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్(2.57 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ(2 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(1.50శాతం)సూచీలకు అధిక లాభాలను సమకూర్చాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 35,324 -  35,546 మధ్య కదలాడి చివరికి 197 పాయింట్ల లాభంతో 35,457.69 వద్ద ముగిసింది. నిఫ్టీ 65 పాయింట్ల లాభపడి 10650 పైన 10,682 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 10,631 - 10,695 మధ్య ట్రేడైంది. ఎన్‌ఎస్‌ఈలో మరో ప్రధాన సూచీ బ్యాంక్‌ నిఫ్టీ 90.80 పాయింట్లు లాభపడి 26,245 వద్ద ముగిసింది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2శాతం లాభపడింది. అలాగే ఫార్మా, ఐటీ, ఆర్థిక, రియల్టీ రంగాలకు చెందిన సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. మరోవైపు మెటల్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లకు చెందిన ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, ఐషర్‌మోటర్స్‌ భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 2.50శాతం నుంచి 9శాతం లాభపడ్డాయి.
టాటాస్టీల్‌, హెచ్‌పీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 6.50శాతం నష్టపోయాయి.



You may be interested

ఎర్నింగ్స్‌ రిస్క్‌ ఉంది...జాగ్రత్త

Friday 16th November 2018

కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ పరంగా చూస్తే రిస్క్‌ ఇంకా మిగిలే ఉందని, రానున్న కాలంలో కంపెనీల లాభాల వృద్ధి తగ్గొచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాన్ని తీసుకుంటే.. ఎర్నింగ్స్‌ పరంగా 2015 నుంచి అదే బలహీనమైన క్వార్టర్‌ అని తెలిపింది. దీనికి జీఎస్‌టీ అమలు కారణమని, దీని వల్ల దేశీ ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, పెయింట్స్‌, ఇండస్ట్రీయల్స్‌ రంగాలపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక

బైబ్యాక్‌ రూట్లో డిజిన్వెస్ట్‌మెం‍ట్‌

Friday 16th November 2018

ముంబై: నిర్థేశిత పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని అందుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే బైబ్యాక్‌ అస్త్రాన్ని సంధించనున్న తెలుస్తోంది. ఈ ఏడాదిలో రూ.80,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యంగా వెల్లడించిన మోడీ సర్కార్‌ ఇప్పటివరకు ఈ మొత్తంలో కనీసం నాలుగింట ఒక వంతును కూడా సమకూర్చుకోలేకపోయింది. గడిచిన ఏడున్నర నెలల్లో కేవలం రూ.15,000 కోట్లను మాత్రమే అందుకున్న కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరో రూ.20,000 కోట్లను ఉపసంహరణల ద్వారా పొందనుందని విశ్వసనీయ

Most from this category