STOCKS

News


రూపాయి ర్యాలీతో లాభాల ముగింపు

Thursday 15th November 2018
Markets_main1542276755.png-22053

  • మళ్లీ 10600 పాయింట్ల పైన ముగిసిన నిఫ్టీ

డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫలితంగా గురువారం సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభాల్ని ఆర్జించగా, నిప్టీ సూచీ మళ్లీ 10600 మార్కును అందుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో సూచీలు మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. మిడ్‌సెషన్‌ సమయానికి డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, ఆసియా మార్కెట్ లాభాల ముగింపు  ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. రూపాయి ర్యాలీతో బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, మెటల్, ఫార్మారంగ షేర్ల కొనుగోళ్లు మొదలయ్యాయి. ఫలితంగా సూచీలు లాభనష్టాల సందిగ్ధత వదలి పూర్తిగా లాభాల బాట పట్టాయి.  మిడ్‌సెషన్‌ సమయం నుంచి కొనుగోళ్ల క్రమంగా పెరగడంతో సూచీలు స్థిరమైన ర్యాలీ చేశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ సూచీ 260 పాయింట్ల లాభాల్ని ఆర్జించి 35,402 వద్ద, నిఫ్టీ సూచీ 70 పాయింట్లు పెరిగి 10,646 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. చివరి అరగంటలో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో సూచీలు కొంతమేరకు లాభాలను కోల్పోవాల్సి వచ్చింది. చివరకు సెన్సెక్స్‌ 118 పాయింట్ల లాభంతో 35,260 వద్ద, నిఫ్టీ సూచీ 40.40 పాయింట్లు పెరిగి 10,616.70 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో మరో ప్రధాన ఇండెక్స్‌ బ్యాంక్‌ నిఫ్టీ ఇంట్రాడేలో 26000 మార్కును అందుకుంది. చివరకు 225 పాయింట్లు లాభంతో  25,946.20 వద్ద ముగిసింది. ఇదే ఎన్‌ఎస్‌ఈలో ఒక్క నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ తప్ప అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాలతో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టీ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ 1శాతం లాభపడింది. ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అధిక వెయిటేజ్ షేర్లైన ఐటీసీ, హిందూస్థాన్‌ యూనిలీవర్‌ పతనంతో నిఫ్టీ ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌ పావుశాతం నష్టపోయింది.
రూపాయి ర్యాలీ:-
వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలతో ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో బలపడింది. బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్‌ డ్రాఫ్ట్‌ ప్లానింగ్‌కు ఆ దేశ క్యాబినెట్‌ ఆమోదం తెలపడంతో పౌండ్‌, యూరో విలువలు బలపడ్డాయి. ఫలితంగా ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ నష్టాల్లోకి మళ్లింది. మరోవైపు ఇటీవల ముడిచమురు ధరల తగ్గుదల, ఆసియా కరెన్సీ్‌లు లాభపడటం తదితర అంశాలు మన రూపాయి ర్యాలీకి కారణమయ్యాయి. ఫలితంగా నేటి ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి 72 స్థాయిని కోల్పోయి 71.86 స్థాయికి బలపడింది.

హీరోమోటోకార్ప్‌, కోటక్‌ బ్యాంక్‌, ఐషర్‌మోటర్‌, టైటాన్‌, అదానీ పోర్ట్స్‌ 2.50శాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి. ఇన్ఫ్రాటెల్‌, ఎన్‌టీపీసీ, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, యస్‌బ్యాంక్‌, గ్రాసిమ్‌ షేర్లు 2శాతం నుంచి 8శాతం నష్టపోయాయి.



You may be interested

నవంబర్‌లో బేర్స్‌దే పైచేయి..!

Thursday 15th November 2018

ముంబై: అక్టోబరులో 5 శాతం పతనాన్ని నమోదుచేసిన సెన్సెక్స్‌ ఆ తరువాత కాస్త కోలుకుని నవంబర్‌లో ఇప్పటివరకు 2 శాతం లాభాలను పొందింది. ఈ మేరకు రిలీఫ్‌ వచ్చినప్పటికీ, గతంలో నవంబర్‌ నెలల్లో చోటుచేసుకున్న పరిణామాలను చూసి ఇన్వెస్టర్లు జంకుతున్నట్లు దలాల్‌ స్ట్రీట్‌ పండితులు వెల్లడించారు. గడిచిన 10 ఏళ్లలో ఏకంగా 7 సార్లు మార్కెట్‌ బేర్స్‌ పట్టులోనే కొనసాగింది. ఈ నెలలో సెన్సెక్స్‌ 1-12 శాతం మేర నష్టాలను

వచ్చే ఏడాది మార్కెట్‌ మెరుగు!!

Thursday 15th November 2018

వచ్చే ఆర్థిక సంవత్సరం బాగుంటుందంటున్నారు సీఎల్‌ఎస్‌ఏ ఇండియా స్ట్రాటజిస్ట్‌ మహేశ్‌ నండూర్కర్‌. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలోకి వెళ్లే కొద్ది లిక్విడిటీ సమస్య ప్రభావాలు కనిపిస్తాయని, నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుందని పేర్కొన్నారు. ఆయన ఒక ఆం‍గ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ఇండియన్‌ మార్కెట్లపై కొంత కాలం జాగ్రత్తతో ఉండాలని హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా పలు సవాళ్ల కారణంగా మార్కెట్లు కరెక‌్షన్‌కు గురవుతూ

Most from this category