STOCKS

News


భారీ లాభాలతో ముగింపు...11,000 సమీపం‍లో నిఫ్టీ

Tuesday 5th March 2019
Markets_main1551782931.png-24441

డాలర్‌ మారకంలో రూపాయి బలపడటంతో పాటు మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 379 పాయింట్లు లాభపడి 36,442 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 10,987 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు కావడంతో పాటు గత రెండు నెలల్లో  ఇంతస్థాయిలో సూచీలు లాభపడటం ఇదే మొదటిసారి. ఒక్క ఐటీ షేర్లలో తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు భారీగా జరగాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌ షేర్లలో కొనుగోళ్లలు సూచీలు ర్యాలీకి తోడ్పాటును అందించాయని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పతనం, డాలర్‌ మారకంలో రూపాయి 43 పైసలు బలపడటం, ఇటీవల దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రమంగా పెరుగుతుండటం తదితర అంశాలు మార్కెట్లో కొనుగోళ్లకు మద్దతినిచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు పెరిగి 36,457 వద్ద, నిప్టీ 132 పాయింట్లను ఆర్జించి 10,995 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది. 

బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, టాటామోటర్స్‌, ఐషర్‌మోటర్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ లిమిటెడ్‌ షేర్లు 5శాతం నుంచి 10శాతం లాభపడగా, సిప్లా, జీ లిమిటెడ్‌, ఇన్ఫోసిస్‌, విప్రో షేర్లు 1శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి  



You may be interested

సంపద సృష్టికి బంగారం వంటి సూత్రాలు!

Wednesday 6th March 2019

ప్రతీ ఇన్వెస్టర్‌ ఇన్వెస్ట్‌ చేసే ముందు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు, వృద్ధికి అనుకూలంగా ఉన్నాయా అన్న అంశాలను తప్పకుండా చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆచరణలో సాధ్యం కావాలంటే ఎవరికి వారు ఇన్వెస్టర్‌గా ముందు తమ అవసరాలను అర్థం చేసుకోవాలి. సందేహంతో ఉంటే ఇందుకు స్మార్ట్‌ మార్గాన్ని ఎడెల్వీజ్‌ పర్సన్‌ వెల్త్‌ అడ్వైజరీ హెడ్‌ రాహుల్‌జైన్‌ సూచిస్తున్నారు.    ప్రత్యేకమైన పెట్టుబడి లక్ష్యాలు ఏం సాధించాలనుకుంటున్నారో ముందు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీ లక్ష్యమే పెట్టుబడి

బ్యాంక్‌ నిఫ్టీ 500 పాయింట్లు జంప్‌

Tuesday 5th March 2019

ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 537 పాయింట్లు(2శాతం) లాభపడింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 27,068 వద్ద ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు ఇంట్రాడే బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల తెరలేపడంతో ఇండెక్స్ పరుగులు తీసింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అత్యధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ, యాక్సి్‌స్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు లాభపడటం ఇండెక్స్‌​ర్యాలీకి కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇంట్రాడేలో 537

Most from this category