STOCKS

News


నవంబర్‌ సిరీస్‌లో 10,743 పాయింట్లకు నిఫ్టీ..!

Tuesday 27th November 2018
Markets_main1543302758.png-22415

ముంబై: మరో రెండు రోజుల్లో నవంబర్‌ ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌ ముగియనుండగా.. ఈ సిరిస్‌ క్లోజింగ్‌ సమయానికల్లా నిఫ్టీ 10,743 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని డెరివేటీవ్‌ అనలిస్టులు భావిస్తున్నారు. 200-రోజుల సాధారణ సగటు కదిలికల స్థాయి ఇక్కడ ఉన్నందున సిరీస్‌ ముగిసే సమయానికి నిఫ్టీ ఈ స్థాయిని తిరిగి పరీక్షించే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. సోమవారం చోటుచేసుకున్న 139 పాయిం‍ట్ల రికవరీ వీరి అంచనాలకు మరింత బలంచేకూర్చింది. ఒకేసారి అనేక సానుకూల అంశాలు ఈర్యాలీకి దోహదపడినట్లు యాక్సిస్ సెక్యూరిటీస్ హెడ్‌ టెక్నికల్ అండ్‌ డెరివేటివ్ అనలిస్ట్ రాజేష్ పాలవియా వివరించారు. డాలరుతో రూపాయి మారకం విలువ బలపడడం, ముడిచమురు ధరలు తగ్గడం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీగా మూల‌ధ‌నం అందుతుండడం వంటి సానుకూల అంశాలు ఇందుకు సహకరించాయన్నారు. నిఫ్టీ 200 డీఎంఏను తిరిగి పరీక్షిస్తుందని అన్నారు. ఇంట్రాడే రికవరీ నేపథ్యంలో ట్రేడర్లు తరువాత నెల పుట్స్‌ను భారీగా విక్రయిస్తున్నట్లు విశ్లేషించారు. 10600, 10500 స్థాయిలో సెల్లింగ్‌ కొనసాగుతున్నట్లు వివరించిన ఆయన.. షార్ట్‌ కవరింగ్‌లో భాగంగా 10,600 నుంచి 11,000 కాల్స్‌ను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే నిఫ్టీ ప్రస్తుత సిరీస్‌లోనే 10,743 పాయింట్లను రీటెస్ట్‌ చేసే అవకాశం ఉందన్నారు. 10,600 వద్ద ఇప్పటికే 30.76 లక్షల షేర్లు ఉండగా.. వీటికి తాజాగా మరో 10.05 లక్షల షేర్లు యాడ్‌ అయినట్లు వెల్లడైంది. ఇదే విధంగా 10,500 వద్ద 42.33 లక్షల షేర్లు ఉండగా.. వీటికి మరో 12.55 లక్షల షేర్లు జతయ్యాయి. 10,600 కాల్స్‌ 22.84 లక్షల షేర్లు అవుట్‌స్టాండింగ్‌ కాగా, 7.9 లక్షల షేర్లు అన్‌వైండ్‌ అయ్యాయి. నిఫ్టీ 200-డీఎంఏను తిరిగి పరీక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బొనంజా పోర్టిఫోలియో అనలిస్ట్‌ రూపక్‌ డే అన్నారు. బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఈ ర్యాలీకి సహకరిస్తాయని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ చందన్ తపరియా అన్నారు.

అవర్లీ చార్ట్‌ పరంగా.. క్రితం స్వింగ్‌ హై అయిన 10,630 బలమైన నిరోధంగా ఉన్నందు వల్ల జాగ్రత్త దోరణి అవసరమని ఏఎఫ్‌సీఓ ఇన్వెస్ట్‌మెంట్స్‌ టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు.  You may be interested

మూలధన సాయం ప్రకటనతో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల ర్యాలీ

Tuesday 27th November 2018

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాల బాట పట్టింది. అయితే ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ మాత్రం 1శాతం ర్యాలీ చేసింది. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.42వేల కోట్ల మూలధన సాయం అందిస్తామని కేంద్ర శాఖ ప్రకటన ఇందుకు కారణమైంది. మధ్యాహ్నం గం.12:20ని.లకు ఇండెక్స్‌ అరశాతం లాభంతో 2,954.70వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే

ఫెడ్‌ రిజర్వ్‌ వైఖరి కోసం పసిడి ఎదురుచూపులు

Tuesday 27th November 2018

కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ వైఖరి కోసం పసిడి చూస్తోంది. ఆసియా ట్రేడింగ్‌లో మంగళవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.11:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర అరడాలర్‌ నష్టపోయి 1,222 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గురువారం ఫెడ్‌ పాలసీ మినిట్స్‌ విడుదల సందర్భంగా ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగంలో కీలక వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ

Most from this category