News


ఏడాదిలో నిఫ్టీ@13వేలు!

Wednesday 10th April 2019
Markets_main1554891123.png-25056

కోటక్‌ సెక్యూరిటీస్‌
రాజకీయ పరిస్థితుల్లో భారీ మార్పులు లేకపోతే(ఎన్నికల్లో స్థిర ప్రభుత్వం ఏర్పడడం) నిఫ్టీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి 12500- 13000 పాయింట్లను చేరుతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ప్రస్తుత పీఈ లెక్క ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని సంస్థ రిసెర్చ్‌ హెడ్‌ రస్మిక్‌ ఓజా చెప్పారు.  నిఫ్టీ ఎర్నింగ్స్‌ వచ్చే మూడేళ్ల పాటు 19 శాతం చక్రీయ వార్షిక వృద్ది నమోదు చేయగలవన్నారు. ఈ మూడేళ్లలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎర్నింగ్స్‌లో గరిష్ఠ వృద్ధి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకింగ్‌, విత్త రంగ కంపెనీల ఫలితాల్లో భారీ మెరుగుదల, కనిష్ఠ బేస్‌ ప్రభావం కారణంగా ఈ ఏడాదే ఎర్నింగ్స్‌ మంచి జోరు చూపుతాయన్నారు. ఏడాది కాలానికి లార్జ్‌క్యాప్స్‌ కన్నా మిడ్‌క్యాప్స్‌ను తాము ఎంచుకుంటామని తెలిపారు. ఏడాదిగా చిన్న స్టాకులు తీవ్రమైన నెగిటివ్‌ జోన్‌లోకి జారాయని, దీంతో లార్జ్‌క్యాప్స్‌తో పోలిస్తే వాటి వాల్యూషన్లు బాగా దిగివచ్చాయని వివరించారు. ఈ కారణంగా పెద్ద స్టాకులకన్నా ఇవే ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం మిడ్‌క్యాప్‌ సూచీ పీఈ సైతం నిఫ్టీ పీఈ కన్నా డిస్కౌంట్‌లో ఉందన్నారు. గతేడాది మిడ్‌క్యాప్‌ పీఈ ప్రీమియంలో ఉందని చెప్పారు. దీంతో పాటు ప్రధాన సూచీలు ఆల్‌టైమ్‌ హైని తాకినా, చిన్న స్టాకుల సూచీలు ఇంకా తమ గరిష్ఠాలకు దిగువనే ఉన్నాయని, అందువల్ల వీటిలో ఇకపై కదలికలుండొచ్చని ఓజా తెలిపారు. ఇటీవల వచ్చిన ఎఫ్‌ఐఐల్లో అధిక శాతం పెద్ద స్టాకుల్లోకి వెళ్లినందున ఇంకా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు ఆల్‌టైమ్‌ హైని తాకలేదని తెలిపారు. 
ఇవే కీలకం
ఇకపై అంతర్జాతీయంగా ప్రపంచ జీడీపీ వృద్ధి, యూఎస్‌- చైనా చర్చలు, బ్రెక్సిట్‌, క్రూడాయిల్‌ ధర, కేంద్ర బ్యాంకుల చర్యలు, అంతర్జాతీయ బాండ్‌ ఈల్డ్స్‌ వంటి అంశాలు, స్థానికంగా ఎన్నికల ఫలితాలు, విత్త పరిస్థితి, కార్పొరేట్‌ ఫలితాలు, ఆర్‌బీఐ చర్యలు, ఐఐపీ వృద్ధి అనే అంశాలు సూచీలను ప్రభావితం చేస్తాయన్నారు.

లాంగ్‌ టర్మ్‌కు ఐదు షేర్లను రికమండ్‌ చేశారు.
1. ఎస్‌బీఐ: టార్గెట్‌ రూ. 410.
2. ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌: టార్గెట్‌ రూ. 2000.
3. వేదాంత: టార్గెట్‌ రూ. 275. 
4. జేకే పేపర్‌: టార్గెట్‌ రూ. 200.
5. సూర్యరోష్ని: టార్గెట్‌ రూ. 330.You may be interested

సెన్సెక్స్‌ 354 పాయింట్లు  డౌన్‌

Wednesday 10th April 2019

11600 పాయింట్ల దిగువన నిఫ్టీ ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర హెచ్చు తగ్గులకు లోనైన మార్కెట్‌ చివరికి భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 354 పాయింట్లను కోల్పోయి 38,585 వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 11600 పాయింట్ల దిగువున 11,584ల వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న భారీ అమ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ 317 పాయింట్లు నష్టపోయి 29,792.45 వద్ద స్థిరపడింది. ప్రపంచ వృద్ధి రేటు అంచనాకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌)

ఎన్నికల్లో ఎవరొచ్చినా ఒక నెల పతనం గ్యారెంటీ!

Wednesday 10th April 2019

సమీర్‌ అరోరా, హీలియోస్‌ క్యాపిటల్‌ మార్కెట్లకు, రాజకీయాలకు మధ్య మరికొంత కాలం సంబంధం కొనసాగుతుందని హీలియోస్‌ క్యాపిటల్‌ ఫౌండర్‌ సమీర్‌ అరోరా అభిప్రాయపడ్డారు. ఎన్నికల అనంతరం ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా సూచీల్లో ఒక నెల పాటు కరెక‌్షన్‌ ఉండొచ్చని అంచనా వేశారు. ఎన్నికల ఫలితాల రోజు లేదా తర్వాత రెండు మూడు రోజులు సూచీలు అప్‌మూవ్‌ చూపినా తర్వాత మాత్రం నెల పాటు పతనం ఖాయమన్నారు. ఎందుకంటే తాజాగా ర్యాలీకి

Most from this category