STOCKS

News


కొద్ది రోజుల్లో 10,500 స్థాయికి నిఫ్టీ!!

Monday 24th December 2018
Markets_main1545645865.png-23203

డెలివేటివ్స్‌ డేటాను, చార్ట్స్‌ను పరిశీలిస్తే.. మార్కెట్‌ ర్యాలీ ముగిసిందనే సంకేతాలు వెలువడుతున్నాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ అనలిస్ట్‌ జై పురోహిత్‌ తెలిపారు. వచ్చే కొద్ది రోజుల్లో ఇండెక్స్‌ 10500 స్థాయికి పడిపోవచ్చని పేర్కొన్నారు. ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లు పడుతున్నప్పటికీ.. నిఫ్టీ-50 మాత్రం గత కొన్ని రోజులుగా ర్యాలీ చేసిందని పేర్కొన్నారు. అయితే శుక్రవారం రోజు మార్కెట్‌లో అమ్మకాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. నిఫ్టీ 11000 స్ర్టయిక్‌ వద్ద కాల్‌ రైటర్స్‌ ఆ స్థాయిని దాటకుంటే గట్టిగా నిరోధించారని, అందువల్ల 10950-11000 స్థాయి నుంచి గట్టి నిరోధం ఎదురైందని పేర్కొన్నారు. దీంతో ఇండెక్స్‌ వెనక్కు వచ్చేసిందన్నారు. ఆర్‌ఎస్‌ఐ కూడా 60-62 నిరోధ స్ధాయి నుంచి కిందకు వచ్చేసిందని, ఇది నెగటివ్‌ డైవర్జెన్సీని సూచిస్తోందని  తెలిపారు. షార్ట్‌ బిల్డప్‌ కారణంగా శుక్రవారం నిఫ్టీ పడిపోయిందని, దీని ప్రకారం చూస్తే ఇండెక్స్‌ మరింత నష్టపోవచ్చని పేర్కొన్నారు. 
చరిత్రను పరిశీలిస్తే సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్కెట్లు చాలా సార్లు ర్యాలీ చేశాయని జై పురోహిత్‌ తెలిపారు. చరిత్ర పునరావృతం కావొచ్చని, రానున్న నెలల్లో మార్కెట్లు పెరగొచ్చని పేర్కొన్నారు. అయితే ఈసారి బుల్స్‌ కష్టపడాల్సి వస్తుందన్నారు. గ్లోబల్‌ ఈక్విటీలు పడిపోతున్నాయని తెలిపారు. వచ్చే నెలల్లో బుల్స్‌ ఆధిపత్యం కనబర్చ వచ్చని, అయితే రానున్న వారాల్లో బేర్స్‌ మార్కెట్‌పై ఆధిపత్యం చూపించవచ్చని పేర్కొన్నారు. ఇలాంటిప్పుడు అధిక బీటా కలిగిన స్టాక్స్‌పై సమీప కాలంలో అమ్మకాల ఒత్తిడి ఏర్పడవచ్చని తెలిపారు. అందువల్ల ఇన్వెస్టర్లు కొంత కాలం వేచి ఉండటం మంచిదని పేర్కొన్నారు. 
నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ తన బ్రేక్‌ఔట్‌ లెవెల్‌ 17630కు పైన, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ తన బ్రేక్‌ఔట్‌ లెవెల్‌ 6340కి పైన స్థిరపడ్డాయని జై పురోహిత్‌ తెలిపారు. అందువల్ల రానున్న రోజుల్లో ఈ ఇండెక్స్‌లు పెరగొచ్చని అంచనా వేశారు. బ్యాంక్‌ నిఫ్టీ గత కొన్ని వారాల్లో ఔట్‌పర్ఫార్మ్‌ చేసిందని తెలిపారు. అయితే శుక్రవారం పడిపోయిందని పేర్కొన్నారు. గ్రేవ్‌స్టోన్‌ డోజి క్యాండిల్‌ను ఏర్పరచిందని తెలిపారు. రానున్న రోజుల్లో బ్యాంక్‌నిఫ్టీ 26000 స్థాయికి రావొచ్చని పేర్కొన్నారు. వచ్చే నెల రోజులకు అదానీ పోర్ట్స్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. 7-11 శాతం రాబడిని అందుకోవచ్చని తెలిపారు.   



You may be interested

10700 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 24th December 2018

270 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ప్రపంచమార్కెట్ల నెలకొన్న అనిశ్చితి వాతావరణంతో దేశీయ మార్కెట్‌ మూడోరోజూ నష్టాలతోనే ముగిసింది. మెటల్‌, అటో మొబైల్‌ షేర్ల పతనంతో సోమవారం సెన్సెక్స్‌ 271 పాయిం‍ట్లు నష్టపోయి 35470 వద్ద, నిఫ్టీ సూచీ 90.50 పాయింట్లను కోల్పోయి 10663 వద్ద ముగిసాయి. ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 154 పాయింట్ల నష్టపోయి 26,706.00 వద్ద ముగిసింది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల ర్యాలీతో ఒక్క ఐటీ ఇండెక్స్‌(అరశాతం

ఐటీ స్టాక్స్‌ అప్‌

Monday 24th December 2018

2శాతం ర్యాలీ చేసిన ఇన్ఫీ, టీసీఎస్‌ షేర్లు మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., సోమవారం ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు లాభాల బాట పట్టాయి. ఐటీ రంగంలో ఈ నెలలో కూడా ఉద్యోగ నియామకాల సృష్టి పెరగడంతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి నష్టాల ప్రారంభం ఐటీ షేర్ల ర్యాలీకి కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1శాతం పెరిగింది. ఐటీ రంగంలో వరుసగా 8నెలలో ఉద్యోగ

Most from this category