STOCKS

News


వచ్చే నెల్లో కొత్త రికార్డులు పక్కా?!

Wednesday 13th March 2019
Markets_main1552455938.png-24571

నిఫ్టీపై అనలిస్టుల అంచనా
కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించమని సూచన
గతేడాది సాధించిన 11760.20 పాయింట్ల ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని వచ్చే నెల్లో దాటుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఇండెక్స్‌ ఆప్షన్స్‌లో కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించవచ్చని సూచిస్తున్నారు. సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చే లోపే సూచీలు సరికొత్త శిఖరాలు తాకుతాయని మార్కెట్‌ వర్గాల్లో అధికశాతం భావిస్తున్నాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు కూడా పెరగడంతో సూచీల పరుగు మరింత స్పీడవుతుందని ఎస్సెల్‌ ఎంఎఫ్‌ ప్రతినిధి విరాల్‌ బెరావాలా చెప్పారు.
కాల్‌స్ప్రెడ్‌ వ్యూహం
ఈ వ్యూహంలో ఒక ఏటీఎం(ఎట్‌ ద మనీ) కాల్‌ లేదా దగ్గరలోని ఓటీఎం(అవుట్‌ ఆఫ్‌ మనీ) కాల్‌ కొనుగోలు చేసి, రెండు సుదూర ఓటీఎం కాల్స్‌ను అమ్మడం జరుగుతుంది. క్రాస్‌సీస్‌ క్యాపిటల్‌, అబాన్స్‌ గ్రూప్‌ తదితర బ్రోకరేజ్‌ల ఉదాహరణలు చూద్దాం...
వ్యూహంలో భాగంగా ఏప్రిల్‌ సీరిస్‌కు చెందిన 11300 కాల్‌ కొని, 11600 కాల్‌‍్స రెండిటిని విక్రయించాలి. లేదా ఏప్రిల్‌ సీరిస్‌కు చెందిన 11700 కాల్‌ ఒకటి కొని, 12000 కాల్స్‌ రెండిటిని విక్రయించాలి. ఉదాహరణకు 11300 కాల్‌ రూ. 246 వద్ద కొనుగోలు చేసి రెండు 11600 కాల్స్‌ను కలిపి రూ. 206 వద్ద విక్రయించడం జరుగుతుంది(మంగళవారం ముగింపు ధరల ప్రకారం). దీంతో మన పెట్టుబడి విలువ రూ. 40(246- 240) అవుతుంది. రూ. 40 స్థాయిని ఎల్‌బీఈపీ(లోయర్‌ బ్రేక్‌ఈవెన్‌ పాయింట్‌)గా పరిగణించాలి. అంటే ఏప్రిల్‌ సీరిస్‌లో నిఫ్టీ 11300 పాయింట్లకు దిగువన క్లోజయితే వచ్చే నష్టమని అర్ధం. అదే నిఫ్టీ 11600 పాయింట్లకు చేరితే రూ. 260 లాభం వస్తుంది(11600- 11340). ఆపైన 11860 పాయింట్లను దాటితే మాత్రం లాభంలో తరుగుదల ఆరంభమవుతుంది. ఈ స్థాయిని యూబీఈపీ(అప్పర్‌ బ్రేక్‌ఈవెన్‌ పాయింట్‌) అంటారు. ఈ స్థాయికి పైన లాభాలు పోయి నష్టాలు వస్తాయి. ఎందుకంటే ఈ స్థాయి వద్ద 11300 కాల్‌ విలువ రూ.560 ఉంటుంది. విక్రయించిన రెండు 11600 కాల్స్‌ విలువ రూ. 520కు చేరుతుంది. వ్యత్యాసం రూ. 40కు చేరుతుంది. ఇది మన పెట్టుబడి విలువకు సమానం. కనుక ఈ స్థాయి వద్ద ట్రేడర్‌కు లాభం, నష్టం ఉండవు. కానీ దీనిపైన క్రమంగా విక్రయించిన కాల్స్‌ విలువ కొనుగోలు చేసిన కాల్‌ కన్నా పెరిగి నష్టం వస్తుంది. అందువల్ల ఈ వ్యూహంలో ఎల్‌బీఈపీ, యూబీఈపీ స్థాయిలను జాగ్రత్తగా గుర్తించి వాటి మధ్యలో లాభాలను ఆర్జించేలా ప్లాన్‌ చేసుకోవాలి. 



You may be interested

రేటు కోతకు బలం

Wednesday 13th March 2019

- పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి జనవరిలో 1.7 శాతం - ఆర్‌బీఐ నిర్దేశ పరిధిలోనే ఫిబ్రవరి రిటైల్‌ ధరలు - పెరుగుదల స్పీడ్‌ 2.57 శాతం న్యూఢిల్లీ: వృద్ధికి ఊతం అందించడంలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సరళతర వడ్డీరేట్ల విధానాన్ని కొనసాగిస్తుందనే అంచనాలకు బలాన్నిచ్చే ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి  సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు జనవరిలో కేవలం 1.7 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జనవరితో

మరో కొత్త గరిష్టానికి బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 13th March 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ అండతో బ్యాంక్‌ నిఫ్టీ రెండో రోజూ రికార్డు ర్యాలీ చేస్తుంది. మార్కెట్‌ లాభాల ప్రారంభంలో భాగంగా నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 28,480.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల బాట పట్టడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇండెక్స్‌ 175 పాయింట్లు లాభపడి 28662.10ల వద్ద కొత్త రికార్డు గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:00లకు ఇండెక్స్‌

Most from this category