STOCKS

News


రెండో రోజూ లాభాలే

Monday 15th October 2018
Markets_main1539598760.png-21172

  • 10500 పైన ముగిసిన నిఫ్టీ
  • రాణించిన ఐటీ షేర్లు

ఫార్మా, ఐటీ షేర్ల ర్యాలీ అండతో మార్కెట్‌ రెండో రోజూ లాభాలతో ముగిసింది. ఇంట్రాడే తీవ్ర ఒడిదుడుకులతో ట్రేడింగ్‌ కొనసాగినప్పటికి చివరి గంటలో కొనసాగిన కొనుగోళ్ల పర్వంతో సూచీలు సోమవారం లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ 10500 పాయిం‍ట్లపైన ముగిసింది. సెన్సెక్స్‌ 150 పాయింట్లను ఆర్జించింది. చివరకు సెన్సెక్స్‌ 131 పాయింట్ల లాభంతో 34,865 వద్ద, నిఫ్టీ 40.00 పాయింట్ల లాభంతో 10512.50  పాయిం‍ట్ల వద్ద ముగిశాయి. నిప్టీ బ్యాంకు ఇండెక్స్‌ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 25,388 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అటో, మెటల్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు నష్టాలతో ముగియగా, మిగతా అన్ని రంగాలకు ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి. అ‍త్యధికంగా ఫార్మా ఇండెక్స్‌ 2.50శాతం లాభపడింది.
ఒడిదుడుకుల ట్రేడింగ్‌:-
గతవారం చివరి ట్రేడింగ్‌ నాటి ర్యాలీని అందుకున్న మార్కెట్‌ నేడు భారీ గ్యాప్‌తో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 238 పాయింట్ల లాభంతో 34,971 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 10,524 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే మన మార్కెట్‌ ప్రారంభానికి ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌, డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత కారణంగా సూచీలు క్షణాల్లో నష్టాల్లోకి మళ్లాయి. మిడ్‌ సెషన్‌ సెషన్‌ అటో, బ్యాంకింగ్‌, మెటల్‌ రంగ షేర్లలో అమ్మకాలతో నిఫ్టీ సూచీ 62 పాయింట్లను నష్టపోయి 10,410 వద్ద, సెన్సెక్స్‌ 174ను కోల్పోయి 34,560ల వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.  మిడ్‌సెషన్‌  అనంతరం మార్కెట్‌ మళ్లీ లాభాల్లోకి మళ్లింది. ఫార్మా, ఐటీ రంగ షేర్లతో పాటు హెవీ వెయిటేజ్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం ర్యాలీ ఇందుకు కారణమయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు గతంలో కోల్పోయిన కీలక సాంకేతిక స్థాయిలను తిరిగి అందుకున్నాయి. సెన్సెక్స్‌ సూచీ 236 పాయింట్లు లాభపడి 35వేల మార్కును, నిఫ్టీ 110 పాయిం‍ట్లు పెరిగి 10500 స్థాయిని తిరిగి అందుకున్నాయి. అనంతరం ముడిచమురు ధరలు పెరుగుదల అంశంపై తెరపైకి రావడం, రూపాయి బలహీనపడటం తదితర కారణాలతో సూచీలు మళ్లీ నష్టాలబాట పట్టాయి. అయితే ఈసారి ఫార్మారంగ షేర్లతో పాటు, ఐటీ షేర్లుతో పాటు, ఐటీసీ ర్యాలీతో సూచీలు మళ్లీ లాభాల్లో మళ్లాయి. ఈ అంశాలకు చివరి గంట కొనుగోళ్లు తోడవ్వడంతో సూచీలు చివరకు లాభాల్లోనే ముగిశాయి
రెండోరోజూ కొనసాగిన ఐటీసీ ర్యాలీ:-
హెవీ వెయిటేజ్‌ కలిగిన ఐటీసీ షేరు ర్యాలీ రెండో కొనసాగింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో  రూ.278.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 3శాతం లాభపడి రూ.283.60లను తాకింది. చివరికి 2.34శాతం లాభంతో రూ.281.65 వద్ద ముగిసింది. నేడు నిఫ్టీ-50 ఆర్జించిన మొత్తం 40 పాయింట్లలో ఒక్క ఐటీసీవే 21 పాయింట్ల కావడం విశేషం. ఐటీసీ కం‍పెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను అక్టోబర్‌ 26న వెల్లడించనుంది. ఈ ఏడాది కాలంలో షేరు 9.1శాతం వరకు ర్యాలీ చేసింది.
గెయిల్‌, ఎంఅండ్‌ఎం, హిందూస్థాన్‌ యూనిలివర్‌, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 2నుంచి3శాతం నష్టపోగా, ఐటీసీ, హిందాల్కో, ఇన్ఫోసిస్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 2నుంచి 4.50శాతం లాభపడ్డాయి.



You may be interested

ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో పెట్టుబడి అవకాశాలు: బీఎన్‌పీ

Tuesday 16th October 2018

ఇటీవల బాగా దిద్దుబాటుకు గురైన స్టాక్స్‌లో వృద్ధి అవకాశాలున్న కొన్నింటిలో బీఎన్‌పీ పారిబాస్‌ ఇన్వెస్ట్‌ చేసింది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లకు అవకాశాలున్నట్టు ఈ సంస్థ తెలిపింది. లిక్విడిటీ కఠినతరం, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో బీఎస్‌ఈ ఫైనాన్స్‌ ఇండెక్స్‌ గత నెలలో 13 శాతం పతనమైన విషయం తెలిసిందే. ప్రైవేటు బ్యాంకులు, జీవిత బీమా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ను నిర్వహించే అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల ఆస్తులు... వచ్చే ఏడాది పాటు కాల

మళ్లీ 74 దిగువకు రూపీ

Monday 15th October 2018

ఇండియన్‌ రూపాయి మళ్లీ 74 మార్క్‌ దిగువకు పడిపోయింది. మధ్యాహ్నాం 3:40 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 46 పైసలు క్షీణించి 74.03 వద్ద ట్రేడవుతోంది. కాగా రూపాయి సోమవారం నష్టాలతోనే ఆరంభమైంది. 73.80 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఆసియా కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం, క్రూడ్‌ ధరలు పెరగడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం ఒకేరోజు 55 పైసలు లాభపడి

Most from this category