STOCKS

News


11425 పాయింట్ల వరకు పతనం!

Monday 8th July 2019
Markets_main1562568966.png-26894

నిఫ్టీపై నిపుణుల అంచనా
బడ్జెట్‌ రోజు నిఫ్టీ చార్టుల్లో ట్రెండ్‌రివర్సల్‌ జరిగిందని టెక్నికల్‌ నిపుణులు విశ్లేషించారు. నిఫ్టీ తన గత గరిష్ఠం 12100 పాయిం‍ట్లను దాటలేక వెనక్కు మరలింది. ఈ తరహా వెనకంజ మార్కెట్‌కు నెగిటివ్‌ పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్‌ వర్గాల అసంతృప్తికి ఇది నిదర్శనమని, రాబోయేరోజుల్లో మార్కెట్లో మరింత డామేజి జరుగుతుందని తెలిపారు. నిఫ్టీ క్రమంగా 11590 పాయింట్ల వరకు ఆపైన 11425 పాయింట్ల వరకు పతనమైతుందని అంచనా వేస్తున్నారు.

మార్కెట్లో నెలకొన్న నెగిటివ్‌నెస్‌ ఆధారంగా ఐదు రకాల సంభావ్యతలను(పాజిబిలిటీస్‌) వివరిస్తున్నారు....

1. నిఫ్టీలో మరింత బలహీనత వచ్చేముందు 11790 పాయింట్ల దిగువన ట్రేడవ్వాలి. అలా ట్రేడయ్యే రోజు ఇంట్రాడే గరిష్ఠ, కనిష్ఠాలు తదుపరి ఫార్మేషన్‌ను నిర్దారిస్తాయి.
2. నిఫ్టీ 11790 పాయింట్ల దిగువన త్రిభుజాకృతి ఫార్మేషన్‌ చూపుతుంది. ఇందులో తొలి మద్దతు 11680 పాయింట్ల వద్ద తదుపరి మద్దతు 11590 పాయింట్ల వద్ద ఉంటాయి.
3. నిఫ్టీ కరెక‌్షన్‌ దశ కొనసాగిస్తే 11425 పాయింట్లను చేరుతుంది. ఎగ్జిట్‌ పోల్‌ రోజున నిఫ్టీ ఈ స్థాయి వద్ద బుల్లిష్‌గ్యాప్‌ ఏర్పరిచింది. 
4. నిఫ్టీ 11420 పాయింట్ల దిగువన క్లోజయితే వేగంగా 11000 పాయింట్ల వరకు క్షీణత ఉంటుంది. 
5. నిఫ్టీ సోమవారం కోలుకొని బుల్‌ట్రాప్‌ ఏర్పరిస్తే మరోమారు 12100 పాయింట్లను పరీక్షించే అవకాశం ఉంటుంది. 

పైన పేర్కొన్న సంభావ్యతల్లో ఐదో అంశం జరగలేదు. అందువల్ల మిగిలిన 4 సంభావ్యతలు జరిగేందుకు ఎక్కువ ఛాన్సులున్నాయి. ముఖ్యంగా మూడో పాయింట్‌ నిజం అవుతుందని ఎక్కువమంది అంచనా. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెరిగినప్పుడు అమ్ము వ్యూహం అవలంబించవచ్చని నిపుణుల సలహా. 



You may be interested

రికవరి బాటలో యస్‌ బ్యాంకు షేర్లు

Monday 8th July 2019

ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్‌ యస్‌ బ్యాంకు షేర్లు సోమవారం 5ఏళ్ల కనిష్టస్థాయి నుంచి రికవరీ అయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.87.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ పతనంలో భాగంగా ఆరంభంలోనే 3శాతం నష్టపోయి రూ.85.70ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఈ ధర షేరుకు 5ఏళ్ల కనిష్టస్థాయి కావడం గమనార్హం. స్థిరమైన పాలన వ్యవస్థతో పాటు ఇద్దరు మేనేజ్‌మెంట్‌ అధికారుల నియామకం గురించి బ్యాంకు అధికారులు

భూషణ్‌ స్టీల్స్‌ ఫ్రాడ్‌: పీఎన్‌బీ 10శాతం క్రాష్‌

Monday 8th July 2019

భూషణ్‌ స్టీల్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ రూ.3,800 కోట్ల మేర మోసానికి పాల్పడిందనే విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు 11.19 శాతం క్షీణించాయి. నేడు బీఎస్‌లో పీఎన్‌బీ షేర్లు రూ.76.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అకౌంట్‌ బుక్‌లో అవకతవకలకు పాల్పడి కన్షారియం బ్యాంకుల నుంచి రుణాలు పొందిన భూషణ్‌ స్టీల్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ రుణాలను పక్కదారి మళ్లించినట్లు పీఎన్‌బీ ఆరోపించింది. మాకు అందిన

Most from this category