STOCKS

News


దీపావళి కల్లా 11,000 స్థాయికి నిఫ్టీ!!

Saturday 13th October 2018
Markets_main1539424285.png-21136

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ దీపావళి కల్లా మళ్లీ 11,000 స్థాయికి చేరొచ్చని ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. మార్కెట్లు బౌన్స్‌బ్యాక్స్‌ అయ్యేట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. రూపాయి పతనం, క్రూడ్‌ ధరల ర్యాలీ, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ వంటి అంశాల నేపథ్యంలో మార్కెట్లు అండర్‌పర్ఫార్మ్‌ చేస్తున్నాయని తెలిపారు. డౌజోన్స్‌ కరెక‌్షన్‌ అస్థిరతను సూచిస్తోందన్నారు. అయితే డాలర్‌ క్షీణత ఇండియన్‌ మార్కెట్లకు సానుకూలమేనని తెలిపారు. ఇండియన్‌ మార్కెట్‌లోని తాజా పతనంపై పాజిటివ్‌గా ఉన్నామని, కొనుగోళ్లకు అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. ఇండెక్స్‌లలో మరో 500-600 పాయింట్ల పెరుగుదలకు అవకాశముందని తెలిపారు. దీపావళి కల్లా నిఫ్టీ 10,800-11,000 పాయింట్ల శ్రేణికి చేరొచ్చని అంచనా వేశారు. 
ఐటీ షేర్లు ర్యాలీ జరిపితే వాటిల్లో నుంచి ఎగ్జిట్‌ కావడానికి ఇదే మంచి అవకాశమని గత 2-3 వారాలుగా చెబుతూ వస్తున్నానని సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. ప్రస్తుత క్యూ2లో టీసీఎస్‌ అదిరిపోయే ఎర్నింగ్స్‌ ప్రకటించిందని, అయితే రూపాయి 12 శాతం పతనం వల్ల మార్జిన్లు దాదాపుగా 1 శాతంమేర మాత్రమే పెరిగాయని పేర్కొన్నారు. రూపాయి క్షీణత వల్ల ఐటీ కంపెనీల ఆదాయం భారీగా పెరుతుందనే ఊహాగానాలకు ఇది తెరదింపిందని తెలిపారు. మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐషర్‌ మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ స్టాక్స్‌పై పాజిటివ్‌గా ఉన్నామని పేర్కొన్నారు. హెచ్‌యూఎల్‌ క్యూ2 ఆర్థిక ఫలితాలను గమనిస్తే.. వినియోగ రంగంలో మరీముఖ్యంగా పర్సనల్‌ కేర్‌ విభాగంలో బలమైన వృద్ధి నమోదయ్యిందన్నారు. హెచ్‌యూఎల్‌ ఫలితాలను గమనిస్తే ఇటీవల కరెక‌్షన్‌కు గురైన ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో కొన్నింటిని కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయమని తెలిపారు. 
ఐటీ స్టాక్స్‌కు దూరంగా ఉండటం మంచిదని సంజీవ్‌ భాసిన్‌ హెచ్చరించారు. ఐటీలో ర్యాలీ ముగింపునకు వచ్చేసిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌ ఫలితాల వెల్లడి తర్వాత చాలా వరకు ఐటీ స్టాక్స్‌ పడిపోవచ్చని అంచనా వేశారు. రిలయన్స్‌, అల్ట్రాటెక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ, ఐషర్‌ స్టాక్స్‌ కొనుగోలు చేయవచ్చన్నారు. ఐటీపై అండర్‌వెయిట్‌తో, ఫార్మాపై ఓవర్‌వెయిట్‌తో ఉన్నామని తెలిపారు.   



You may be interested

మిశ్రమంగా రియల్టీ రంగ ఫలితాలు: హెచ్‌డీఎఎఫ్‌సీ

Saturday 13th October 2018

ముంబై:- ఇటీవల ద్రవ్యత్వ కొరతతో అతలాకుతలమైన రియల్టీ రంగం రెండో త్రైమాసిక ఫలితాలపై హెచ్‌డీఎఫ్‌సీ అంచనాలను నివేదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2) రియల్టీ రంగం మిశ్రమ ఆర్థిక ఫలితాలను నమోదు చేయవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనావేస్తుంది. డీఎల్‌ఎఫ్‌, బబేరాయ్‌, బ్రిగేడ్‌ కంపెనీలు ఇయర్‌ టు ఇయర్‌ బలమైన గణాంకాలను నమోదు చేయవచ్చు. ప్రేస్టేజ్‌, శోభ, కోట్లే లాభాదాయ పెరుగుదల బలహీనంగా ఉండొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ అంచనా వేస్తుంది. నిఫ్టీ

ఐపీఓకు ఇమామి సిమెంట్‌ లిమిటెడ్‌

Saturday 13th October 2018

ఇష్యూ విలువ రూ.1000 కోట్లు ముంబై:- ఐపీఓ ద్వారా నిధుల సమీకరించేందుకు ఇమామి సిమెంట్‌ లిమిటెడ్‌ కంపెనీ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను శుక్రవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థకు సెబి సమర్పించింది. ఈ ఐపీఓ ఇష్యూ ధర కంపెనీ మొత్తం రూ.1000 కోట్లను సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన షేర్లు తాజా షేర్లను జారీ చేయనుంది. అలాగే ప్రస్తుత ప్రమోటర్లతో పాటు, షేర్‌ హోల్డర్లు సైతం

Most from this category