STOCKS

News


లాభాలు ఒక్కరోజుకే పరిమితం

Tuesday 9th October 2018
Markets_main1539079748.png-20980

మార్కెట్‌కు మంట పెట్టిన ముడిచమురు ధర
కొత్త కనిష్టానికి చేరిన రూపాయి

మార్కెట్‌ లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. సూచీలు మంగళవారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడిచమురు మంటలు మరోసారి చెలరేగడంతో దేశీయంగా రూపాయి కొత్త కనిష్టాన్ని అందుకుంది. ఫలితంగా అటో, ఎఫ్‌ఎంజీసీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలు మార్కెట్‌కు నష్టాల ముగింపునకు కారణమయ్యాయి. నిఫ్టీ సూచి 47 పాయింట్ల నష్టంతో 10301 వద్ద, సెన్సెక్స్‌ 175 పాయింట్లను కోల్పోయి 34299 వద్ద ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ అరశాతం(175 పాయింట్లు) నష్టపోయి 22540 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అటో ఇండెక్స్‌ అత్యధికంగా 3శాతం నష్టపోయింది. అలాగే ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌, ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండెక్స్‌, ప్రైవేట్‌ బ్యాంకు ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. మరోవైపు రూపాయి కనిష్ట పతనం కారణంగా డాలర్ల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ఫార్మా రంగ ఇండెక్స్‌ అత్యధికంగా 1.50శాతం లాభపడింది. అయితే  నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ కేవలం 0.25శాతం మాత్రమే లాభపడింది. గత ట్రేడింగ్‌లో భారీ నష్టపోయిన మెటల్‌ షేర్లలో నేడు రికవరీ జరిగడంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1శాతం లాభపడింది. వాటితో పాటు నిఫ్టీ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ సూచీ కూడా 0.25శాతం లాభపడింది.
ఏషియన్‌ పేయింట్స్‌, ఐషర్‌మోటర్స్‌, హెచ్‌పీసీఎల్‌, టైటాన్‌, టాటామోటర్స్‌ షేర్లు 3.50శాతం నుంచి 13శాతం నష్టపోయాయి. వేదాంత, అదానీపోర్ట్స్‌, బజాజ్‌ఫైనాన్స్‌, జీలిమిటెడ్‌, డాక్టర్‌రెడ్డీస్‌ షేర్లు 2.50శాతం నుంచి 5.30శాతం లాభపడ్డాయి.



You may be interested

కరెక్టివ్‌ బౌన్స్‌కు ఛాన్స్‌!!

Tuesday 9th October 2018

మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోందన్నారు నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ హెడ్‌ (టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ రీసెర్చ్‌) షబ్బీర్‌ కైయుమి తెలిపారు. గత శుక్రవారం నిప్టీ ఇండెక్స్‌ 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ కిందకు వచ్చేసిందని, ఆరు నెలల కనిష్ట స్థాయి వద్ద క్లోజయ్యిందని పేర్కొన్నారు. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని తెలిపారు. ఇండియా వీఐఎక్స్‌ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతోందని, ఇది మార్కెట్‌లో అధిక

ఏడాది లక్ష్యంతో మిడ్‌క్యాప్స్ ఓకే..

Tuesday 9th October 2018

మిడ్‌క్యాప్స్‌లో వ్యాల్యుయేషన్స్‌ తక్కువగా ఉన్నాయని ఎలారా సెక్యూరిటీస్‌ హెడ్‌ (ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీ) రవి సుందర్‌ ముత్తుకృష్ణన్‌ తెలిపారు. అయితే వీటిల్లో మరికొంత డౌన్‌సైడ్‌ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్లకు ఇది సరైన సమయం కాదని, అయితే ఏడాది లక్ష్యంతో నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని సిఫార్సు చేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  భారత్‌లో ప్రస్తుతం రూపాయి క్షీణత, క్రూడ్‌ ధరల పెరుగుదల, ద్రవ్యలోటు

Most from this category