STOCKS

News


ఎట్టకేలకు రిలీఫ్‌ర్యాలీ

Wednesday 10th October 2018
Markets_main1539166927.png-21022

  • 10460 స్థాయిని అందుకున్ననిఫ్టీ
  • సెన్సెక్స్‌ 461 పాయింట్ల లాభం
  • మార్కెట్‌ను నడిపించిన బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లు

ముంబై:- ఎట్టకేలకు మార్కెట్‌లో రిలీఫ్‌ర్యాలీ జరిగింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బేర్స్‌ షార్ట్‌ కవరింగ్‌ ఫలితంగా సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు ఆరునెలల కనిష్టస్థాయి నుంచి కోలుకున్నాయి. రెండో త్రైమాసిక ఫలితాలపై మార్కెట్‌ ఆశావహన అంచనాలు కూడా మార్కెట్‌ ర్యాలీకి కారణమైంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ, అటో రంగ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ 482 పాయింట్ల లాభంతో 34,781 వద్ద, నిప్టీ 159 పాయింట్ల లాభంతో 10,460 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 560 పాయింట్ల ఆర్జించి 34,858.35 వద్ద, నిఫ్టీ 181 పాయిం‍ట్లు లాభపడి 10,482.35 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.50శాతం లాభపడింది. రూపాయి రివకరీ కారణంగా ఐటీ ఇండెక్స్‌ తప్ప అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లోనే ముగిశాయి.

విప్రో, హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం నష్టపోగా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటర్స్‌, జీ లిమిటెడ్‌, బజాజ్‌ఫైనాన్స్‌, బజాజ్‌ఫిన్‌ సర్వీసెస్‌ షేర్లు 6.50శాతం నుంచి 10.15శాతం లాభపడ్డాయి.

మార్కెట్‌ ర్యాలీకి కారణాలివే:-
1.రూపాయి రికవరీ:- ఆర్థిక వ్యవస్థలో లిక్విటిడీని పెంచేందుకు ప్రభుత్వం అక్టోబర్‌ 11నుంచి ఓపెన్‌ మార్కెట్‌ పద్ధతిలో రూ.12వేల కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.
ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో డాలర్‌ మారకంలో రూపాయి కనిష్టస్థాయి 74.39స్థాయి నుంచి 26 పైసలు బలపడి 74.11స్థాయికి రికవరీ అయ్యింది.
2.బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ:- నేటి మార్కెట్‌ ర్యాలీని బ్యాంక్‌ షేర్లు ముందుండి నడిపించాయని చెప్పవచ్చు. బ్యాంకింగ్‌ షేర్లలో అధిక వెయిటేజ్‌ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యస్‌బ్యాంకు షేర్లు 3శాతం లాభపడ్డాయి. నిన్న మార్కెట్‌ ముగిసే సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 24,527.65 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో  25300 పాయింట్ల స్థాయిని అందుకుంది.
3.చల్లారిన ముడిచమురు ధరలు:- అంతర్జాతీయ మార్కెట్లో గత కొంతకాలంగా మండుతున్న ముడిచమురు ధరలు చల్లారడం నేటి మార్కెట్‌ ర్యాలీకి కలిసొచ్చింది. 2018-19లో ప్రపంచ ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పడుతుందనే ఐఎంఎఫ్‌ అంచనాల వేసింది. ఫలితంగా బుధవారం బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్‌ ధర 21 సెంట్ల వరకు తగ్గి 84.79 డాలర్లకు దిగివచ్చింది.
1. ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ షేర్లు వరుసగా 13వ ట్రేడింగ్‌ సెషన్‌లో కూడా లోయర్‌ సర్క్యూట్‌ వద్ద లాక్‌ అ‍య్యాయి. ఈ 13 సెషన్లలో ఈ షేరు మొత్తం 49 శాతం నష్టపోయింది.
2. నేడు ఎక్చ్సేంజ్‌లో లిస్టైన గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీఓ ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది. ఇష్యూధర రూ.118లతో పోలిస్తే ఈ కంపెనీ షేర్లు 12శాతం డిస్కౌంట్‌తో లిస్టయ్యాయి. ఇంట్రాడేలో 19శాతం నష్టపోయాయి. చివరకు 11శాతం నష్టంతో రూ.105 వద్ద ముగిశాయి.
3. ప్రభుత్వం ఏవియేషన్‌ టర్బైన్‌ ఇంధన ధరలపై ఎక్సైంజ్‌ సుంకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుందనే వార్తలతో విమానయాన షేర్లు ర్యాలీ చేశాయి. జెట్‌ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌ షేర్లు 9శాతం ర్యాలీ చేశాయి.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రాష్‌..

Thursday 11th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం భారీ నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:35 సమయంలో ఏకంగా 271 పాయింట్ల నష్టంతో 10,208 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,465 పాయింట్లతో పోలిస్తే 257 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ గురువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  ఆసియా మార్కెట్లు ఢమాల్‌.. ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ

కుప్పకూలనున్న క్రిప్టోకరెన్సీ?!

Wednesday 10th October 2018

అనలిస్టుల హెచ్చరిక క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ కుప్పకూలే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ఎకనమిస్టులు, జునిపెర్‌ రిసెర్చ్‌ తదితర సంస్థలు హెచ్చరిస్తున్నాయి. క్రిప్టోల్లో దిగ్గజంగా చెప్పుకునే బిట్‌ కాయిన్‌ డైలీ లావాదేవీ వాల్యూంలు(డీటీవీ) ఏడాది సరాసరి కన్నా కనిష్ఠాలకు పడిపోవడం ప్రమాదఘంటికని చెబుతున్నారు. 2017లో బిట్‌కాయిన్‌ సరాసరి డీటీవీలు 3.6 లక్షలుండగా, 2018 సెప్టెంబర్‌నాటికి 2.3 లక్షలకు పడిపోయాయి. అదే విధంగా డైలీ లావాదేవీ విలువ గతేడాది 370 కోట్ల డాలర్లుండగా, ఈ ఏడాది

Most from this category