STOCKS

News


నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.50శాతం అప్‌

Wednesday 10th October 2018
Markets_main1539147509.png-20996

నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ బుధవారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1.50శాతం లాభపడింది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 24,596.60 వద్ద ప్రారంభమైంది. నేటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు బ్యాంకు షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 1.50శాతం పెరిగి 24,853.70 వద్దకు చేరుకుంది. ఈ సూచీలోని భాగమైన మొత్తం 12 షేర్లలో 11 షేర్లకు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, యస్‌ బ్యాంక్‌ మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, అర్‌బీఎల్‌ షేర్లు 3శాతం లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 2శాతం పెరిగాయి. ఎస్‌బీఐ, ఫెడరల్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌లో నెలకొన్న అ‍మ్మకాల కారణంగా ఆ కంపెనీ షేరు 1శాతం నష్టపోయింది. ఉదయం గం.10:15ని.లకు నిఫ్టీ ఇండెక్స్‌ 1.12శాతం(275 పాయింట్లు) లాభంతో 24,801.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఓఎంసీల డివిడెండ్‌లు తగ్గవు

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: ఇంధనాలపై సబ్సిడీ భారం కారణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) కేంద్రానికి ఇచ్చే డివిడెండ్లో ఈసారి కోత పడొచ్చన్న వార్తలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్‌సీ గర్గ్‌ తోసిపుచ్చారు. డిజిన్వెస్ట్‌మెంట్ ఆదాయం తగ్గొచ్చని, సబ్సిడీల్లో కోత పెట్టొచ్చని వస్తున్న వార్తలను ఖండించారు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలంటూ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. సబ్సిడీల్లో కోత పెట్టే యోచనేదీ ప్రభుత్వానికి లేదన్నారు. మరోవైపు

కేంద్రం ముందుకు బీవోబీ విలీన ప్రతిపాదన

Wednesday 10th October 2018

ముంబై: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ), దేనా, విజయా బ్యాంక్ విలీన ప్రతిపాదన కేంద్రం ముందుకు చేరింది. తుది అనుమతుల కోసం మూడు బ్యాంకులు విలీన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ పీఎస్ జయకుమార్ తెలిపారు. షేర్ల విలీనం, మార్పిడి నిష్పత్తి తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి లాంఛనంగా అనుమతులు వచ్చాక.. విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు. ఇది పూర్తి

Most from this category