STOCKS

News


రికవరి బాటలో బ్యాంకు నిఫ్టీ

Tuesday 9th July 2019
Markets_main1562660230.png-26923

మార్కెట్‌ రికవరిలో భాగంగా మిడ్‌సెషన్‌ సమయానికి బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ తిరిగి కోలుకుంది. ఎన్‌ఎస్‌ఈలో  బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ నేడు 11,531.60ల స్థాయి వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం సెషన్‌లో మార్కెట్‌ పతనంలో భాగంగా దాదాపు 1శాతం క్షీణించి 30346.70 స్థాయికి పతనమైంది. అనంతరం మార్కెట్లో జరిగిన షార్ట్‌ కవరింగ్‌లో భాగంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ ఇంట్రాడే కనిష్టస్థాయి(30346.70) నుంచి 1.20శాతం లాభపడి 30346.70స్థాయి ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:15ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(30,603.85)తో పోలిస్తే 10 పాయింట్ల లాభంతో 30,592.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 2శాతం లాభపడంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ 1.50శాతం, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు 1శాతం లాభపడ్డాయి. బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌ అరశాతం, యాక్సి్‌స్‌ బ్యాంకు షేరు అరశాతం ర్యాలీ చేయగా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 0.25శాతం లాభపడింది. ఇదే సమయానికి యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం క్షీణించాయి.
ఇక బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 41 పాయింట్ల నష్టంతో 38,679.89 వద్ద, నిఫ్టీ 20.80 పాయింట్లను కోల్పోయి 11,537.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఈ షేర్లలో బేరిష్‌ సంకేతాలు!

Tuesday 9th July 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   బేరిష్‌ క్రాసోవర్‌ సోమవారం

ప్రస్తు‍త పరిస్థితిని కొనుగోలుకు వాడుకోండి: సంజివ్‌ భాసిన్‌

Tuesday 9th July 2019

‘బడ్జెట్‌ను అర్థం చేసుకోడానికి మార్కెట్లకు ఇంకో వారం రోజులు పడుతుంది. ఈ సమయాన్ని కొనుగోలుకు వినియోగించుకోవాలి’ అని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఎక్స్యూకుటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజివ్‌ భాసిన్‌  ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే...   మార్కెట్లు అతిగా స్పందించాయి.. పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ కనీస పరిమితిని బడ్జెట్‌లో 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడంతో స్టాక్‌ మార్కెట్‌లో షేర్‌ సప్లై పెరగనుండడంతో

Most from this category