STOCKS

News


బ్యాంకింగ్‌ షేర్ల దూకుడు

Friday 16th November 2018
Markets_main1542343848.png-22065

మార్కెట్లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు వరుసగా రెండో రోజూ లాభపడుతూ సూచీల ర్యాలీకి బాసటగా నిలుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1శాతం లాభపడింది. ఉదయం గం.10:00లకు ఇండెక్స్‌ గత ముగింపు (26155)తో పోలిస్తే 26300 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 11 షేర్లలో 9 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఫెడరల్‌ బ్యాంక్‌ 2శాతం లాభపడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.50శాతం, పంజాజ్‌నేషనల్‌బ్యాంక్‌ 1శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు యస్‌ బ్యాంక్‌ పతనం రెండోరోజూ కొనసాగుతోంది. కొత్త సీఈవో, ఎండీ అన్వేషణ కోసం ఏర్పాటైన సెర్చ్‌, సెలక్షన్‌ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఓపీ భట్‌ రాజీనామా చేయడంతో నేటి ట్రేడింగ్‌లో ఆ బ్యాంక్‌ షేరు 7శాతం నష్టపోయింది. నాన్‌ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవికి అశోక్‌ చావ్లా రాజీనామా వార్తలతో  గురువారం 8 శాతం పతనమై రూ. 206 వద్ద ముగిసి సంగతి తెలిసిందే. వాటితో పాటు ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంక్‌ షేర్లు కూడా అరశాతం నష్టపోయాయి.



You may be interested

రూపాయి అప్‌

Friday 16th November 2018

ఇండియన్‌ రూపాయి వరుసగా నాల్గవ సెషన్‌లోనూ బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే పెరిగింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి 0.07 శాతం పెరుగుదలతో 71.92 వద్ద ట్రేడవుతోంది. రూపాయి గురువారం ముగింపు స్థాయి 71.98గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి శుక్రవారం 72.01 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.765 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.756

4 వారాల గరిష్టానికి సూచీలు

Friday 16th November 2018

35,500 పాయింట్లకు పైన సెన్సెక్స్‌ 10,700 దిశగా నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు లాభాలు మరంత పెరిగాయి. ఉదయం 10:05 సమయంలో సెన్సెక్స్‌ 240 పాయింట్ల లాభంతో 35,501 వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 10,682 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 35,529 పాయింట్ల గరిష్ట స్థాయిని, నిఫ్టీ 10,689 గరిష్ట స్థాయిని తాకాయి. ఇండెక్స్‌లు అక్టోబర్‌ 17 తర్వాత ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం.  ఇక నిఫ్టీ-50లో ఐషర్‌ మోటార్స్‌,

Most from this category