STOCKS

News


1శాతం పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 22nd May 2019
Markets_main1558517827.png-25888

మిడ్‌సెషన్‌ సమయానికి బ్యాంక్‌ నిప్టీ భారీగా లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్ల ర్యాలీతో నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.20శాతం లాభపడి 30,675.10ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 5శాతం లాభపడింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.50 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 2శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.50శాతం, ఎస్‌బీఐ 1శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేర్లు అరశాతం పెరిగాయి. మరోవైపు యస్‌ బ్యాంకు 2.50శాతం నష్టపోగా, పీఎన్‌బీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు 2శాతం, హెచ్‌డీఎఫ్‌ బ్యాంకు అరశాతం క్షీణించాయి. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గతముగింపు (30,308.40)తో పోలిస్తే 0.75శాతం లాభంతో 30,489.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

స్వల్పలాభంతో ముగింపు

Wednesday 22nd May 2019

సార్వత్రిక ఎన్నికల ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో బుధవారం మార్కెట్‌  స్వల్పంగా లాభపడింది. ట్రేడింగ్‌ ఆద్యంతం‍ లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు.. చివరి గంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 140.41 పాయింట్ల లాభంతో 39000ల పైన 39,110.21 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 11,738 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 218 పాయింట్లు లాభపడి 30,526.80 వద్ద

ఇండస్‌ఇండ్‌ లాభంలో 62 శాతం క్షీణత

Wednesday 22nd May 2019

మార్చి త్రైమాసికానికి ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు నికరలాభం భారీగా పతనమైంది. క్యు4లో బ్యాంకు లాభం 62.21 శాతం క్షీణించి రూ. 360.10 కోట్లకు చేరింది. ప్రొవిజన్స్‌ ఐదు రెట్లు పెరగడం నికరలాభంపై తీవ్ర ‍ప్రభావం చూపింది. గత క్యు4లో బ్యాంకు రూ. 953.09 కోట్ల లాభం నమోదు చేసింది. తాజా త్రైమాసికంలో బ్యాంకు ప్రొవిజన్లు రూ. 1561 కోట్లను చేరాయి. గత క్యు4లో ఈ కేటాయింపులు రూ. 335 కోట్లు

Most from this category