STOCKS

News


5రోజుల తరువాత లాభాల్లోకి

Friday 7th December 2018
Markets_main1544170295.png-22731

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేరు ర్యాలీ అండతో శుక్రవారం బ్యాంక్‌ నిఫ్టీ 5 రోజుల తర్వాత లాభాల్లోకి మళ్లింది. రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లపై యధాతథ నిర్ణయం నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లపై అ‍మ్మకాల ఒత్తిడి ఏర్పడింది. ఫలితంగా గత 5 ట్రేడింగ్‌ సెషన్స్‌లో బ్యాంకు నిఫ్టీ నష్టాలతోనే ముగిసింది. వారెన్‌ బఫెట్‌ కంపెనీ బెర్కషైర్ హాత్వే కోటక్‌ బ్యాంక్‌లో 10శాతం వాటాను కోనుగోలు చేస్తున్నట్లు వార్తలు వెలువడంతో నేడు ఆ బ్యాంకు షేరు​14శాతం ర్యాలీ చేసింది. నేడు బ్యాంకు నిఫ్టీ 26,307.40 వద్ద ప్రారంభమైంది. కోటక్‌ ర్యాలీతో బ్యాంకు నిఫ్టీ 1శాతం లాభపడి 26,495.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(26,198.30)తో పోలిస్తే 0.70శాతం పెరిగి 26,400 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచిలోని 12 షేర్లకు గానూ 10 నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ, కేవలం యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతుండం విశేషం. ఇండెక్స్‌లో అత్యధికంగా కోటల్‌ బ్యాంక్‌ 7.59శాతం లాభపడగా, ఫెడరల్‌ బ్యాంక్ 2.50శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

తగ్గినపుడు కొనడమే సరైన వ్యూహం..!

Friday 7th December 2018

ముంబై:  మార్కెట్‌ను చూసి ఏమాత్రం భయపడవద్దని, భారత మార్కెట్‌ పట్ల బుల్లిష్‌గా ఉండడం సరైన నిర్ణయమని బీఎస్‌ఈ సభ్యుడు రమేష్ దమానీ సూచించారు. అవకాశాలు ఉన్నప్పుడే మార్కెట్‌లో పెట్టుబడులు మంచిదని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మార్కెట్‌ మాయాజాలాన్ని యువకులు అర్థం చేసుకుని ఓర్పుగా ఉండాలని సూచించిన ఈయన.. ఇలా వేచి ఉండడం వల్ల దీర్ఘకాలంలో భారీ మొత్తంలో సంపదను పొందవచ్చని వివరించారు. ఇందుకు బుల్లిష్‌గా

హెచ్‌సీఎల్‌ టెక్‌ 7% డౌన్‌.. కారణం ఇదే!!

Friday 7th December 2018

దేశీ మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 7 శాతం మేర క్షీణించింది. ఐబీఎం-హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ డీల్‌ ఇందుకు కారణం. ఐబీఎం నుంచి 1.8 బిలియన్‌ డాలర్ల విలువైన వివిధ రకాల సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్టులను కొనుగోలు చేస్తామని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రకటించడం షేరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కాగా ఐబీఎం-హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ డీల్‌ వచ్చే ఏడాది ప్రథమార్ధం చివరి భాగంలో పూర్తి కావొచ్చు.

Most from this category