News


నష్టాల్లో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌

Tuesday 6th November 2018
Markets_main1541498008.png-21759

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా  మంగళవారం మిడ్‌సెషన్‌ అనంతరం ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన సూచీ బ్యాంక్‌ నిఫ్టీ నష్టాల బాట పట్టింది. సూచీలుఓ పలు ప్రభుత్వరంగ షేర్ల నష్టాల ర్యాలీ ఇందుకు కారణమవుతోంది. ఎస్‌బీఐ, ఇండస్‌ ఇండక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్ల పతనంతో దాదాపు 1శాతం నష్టపోయి 25,558ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇం‍డెక్స్‌ గత ముగింపు(25732.20)తో పోలిస్తే అరశాతం నష్టంతో 25,596.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో ఎస్‌బీఐ బ్యాంక్‌, యాక్సి్‌స్‌ బ్యాంక్‌ 3శాతం నష్టపోయాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ 1శాతం నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు యస్‌బ్యాంక్‌ 2శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అరశాతం పెరిగింది.



You may be interested

ఒడిదుడుకులు కొనసాగుతాయి: సమీర్‌ అరోరా

Tuesday 6th November 2018

ఫైనాన్స్‌ రంగంలో ప్రైవేట్‌ బ్యాంక్‌, బీమా, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను చూడవచ్చని సూచించిన సమీర్‌  ముంబై: మార్కెట్‌ భారీ హెచ్చు తగ్గుల సమయంలో కూడా మంచి రాబడిని పొందినట్లు హీలియోస్‌ క్యాపిటల్‌ వ్యవస్థాపకుడు, ఫండ్‌ మేనేజర్‌ సమీర్‌ అరోరా వెల్లడించారు. ఈ ఏడాది ఒడిదుడుకుల మార్కెట్‌లో షార్ట్‌ బుక్‌ చేయడం ద్వారా 28 శాతం రాబడిని తాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. దీర్ఘకాలం ఎక్స్‌పోజర్‌ కలిగిన పలు ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను హెడ్జింగ్‌ చేయడం

5నెలల కనిష్టానికి సిప్లా

Tuesday 6th November 2018

ఔషధ రంగ దిగ్గజం సిప్లా షేరు మంగళవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 5నెలల కనిష్టానికి చేరుకుంది. సిప్లా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ విశ్లేషకులు ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదు చేయలేకపోయింది. దీంతో పాటు సిటీ, హెచ్‌ఎస్‌బీసీ,  క్రెడిట్‌ శాచ్స్‌ వంటి బ్రోకరేజ్‌ సంస్థలు సిప్లా షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో షేరు నష్టాల బాట పట్టింది. పలితంగా నేడు షేరు

Most from this category