STOCKS

News


26000పైన బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 14th November 2018
Markets_main1542178753.png-21994

ముడిచమురు ధరల పతనం భారత్‌ మార్కెట్‌కు బాగా కలిసొస్తుంది. చమురు ధరల క్షీణత కారణంగా రానున్న రోజుల్లో క్యాడ్‌ తగ్గుతుందనే అంచనాలతో డాలర్‌ మారకంలో రూపాయి రెండు నెలల గరిష్టాన్ని తాకింది. రూపాయి ర్యాలీతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. నిజానికి నేటి సూచీల ర్యాలీకి బ్యాంకింగ్‌ రంగ షేర్లు సారథ్యం వహిస్తున్నాయిని  చెప్పవచ్చు. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ బ్యాంక్‌ 1.50శాతం లాభపడి 26వేల మార్కును అందుకుంది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(25,768.60)తో పోలిస్తే 1శాతం లాభంతో 26,031.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ షేర్లు 3శాతం పెరిగాయి. ఇండస్‌ ఇండ్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1శాతం పెరిగాయి. మరోవైపు అత్యధికంగా కోటక్‌ బ్యాంక్‌ 1శాతం నష్టపోగా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి.



You may be interested

నవంబర్‌లో నిఫ్టీ 400 పాయింట్ల ర్యాలీకి ఛాన్స్‌!!

Wednesday 14th November 2018

నిఫ్టీ నవంబర్‌లో 400 పాయింట్లు మేర పెరగొచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌) సంజీవ్‌ భాసిన్‌ అంచనా వేశారు. ఇక్కడి నుంచి బ్యాంక్‌ నిఫ్టీ ఔట్‌పర్ఫార్మ్‌ కనబరుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎర్నింగ్స్‌ పరంగా ఆశ్చర్యానికి గురిచేసిన కంపెనీలు ఆయా రంగాల ఇండెక్స్‌లను ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  ‘కేవలం క్రూడ్‌ అని మాత్రమే

భారత్‌పై పాజిటివ్‌..

Wednesday 14th November 2018

భారత్‌పై సానుకూల అంచనాలతోనే ఉన్నామని, ఇన్వెస్ట్‌మెంట్‌ అలొకేషన్‌లో ఎలాంటి మార్పులు లేవని సీఎల్‌ఎస్‌ఏ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ క్రిస్టోఫర్‌ ఉడ్‌ తెలిపారు. ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధానాలను అనుసరించడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తంచేయడం సముచితమేనని అభిప్రాయపడ్డారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుదల నేపథ్యంలో ఆర్‌బీఐ సరళ ద్రవ్య విధానాలను అనుసరించొచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పదికి ఎనిమిది మార్క్‌లు వేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది గొప్ప మార్కులు ఏమీ కాదని, ప్రభుత్వం

Most from this category