STOCKS

News


అరశాతం పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Monday 15th April 2019
Markets_main1555314931.png-25138

ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంకు నిఫ్టీ సోమవారం అరశాతానికి పైగా ర్యాలీ చేసింది. నేడు బ్యాంకు నిఫ్టీ 29,983.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ప్రైవేట్‌ రంగ షేర్లైన కోటక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 1శాతం పెరిగాయి.  ఇండెక్స్‌లో వాటితో పాటు పీఎన్‌బీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఐడీఎఫ్‌సీఫస్ట్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 0.75శాతం లాభపడి 30160.95ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గతముగింపు (29,938.55)తో పోలిస్తే 0.65శాతం లాభంతో 30,124.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో యస్‌ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా షేర్లు 0.20శాతం నష్టపోయాయి.



You may be interested

10670పైన కొనసాగితే అప్‌సైడ్‌!

Monday 15th April 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా సోమవారం నిఫ్టీ అప్‌మూడ్‌లో కొనసాగుతోంది. క్రమంగా 116900 పాయింట్ల వరకు చేరింది. గతవారం కదలాడిన 11550- 11700 రేంజ్‌ పైఅవధిని చేరింది. వీక్లీ చార్టుల్లో నిఫ్టీ లోయర్‌హై, లోయర్‌లో ఏర్పరిచింది. దీంతో ఏడువారాల అప్‌ట్రెండ్‌ తర్వాత తొలిసారి డైన్‌సైడ్‌ సంకేతాలు ఇచ్చినట్లయింది. అయితే తిరిగి సోమవారం నిఫ్టీ స్థిరంగా అప్‌మూవ్‌ కొనసాగించడంతో ట్రేడర్లు అయోమయంలో ఉన్నారు. నిఫ్టీ ప్రస్తుత కదలికలను చూస్తే 11550 పాయింట్లను కాపాడుకున్నంత కాలం

3నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Monday 15th April 2019

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15:  ప్రైమరీ ఆర్టికల్స్‌, ఇంధన ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3నెలల గరిష్టానికి చేరుకుంది.  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం  మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 3.18శాతంగా నమోదదైంది. గతేడాది (2018) మార్చిలో ఇది 2.74శాతంగా ఉంది. అంతక్రితం నెల 2.93 శాతంగా నమోదైంది. వాహన ఇంధనం, ఎల్‌పీజీ ధరలు పెరగడంతో ఇంధన, విద్యుత్తు ద్రవ్యోల్బణం 5.41శాతానికి పెరిగింది. ఇది ఫిబ్రవరిలో

Most from this category