STOCKS

News


మరో కొత్త గరిష్టానికి బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 13th March 2019
Markets_main1552453304.png-24570

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ అండతో బ్యాంక్‌ నిఫ్టీ రెండో రోజూ రికార్డు ర్యాలీ చేస్తుంది. మార్కెట్‌ లాభాల ప్రారంభంలో భాగంగా నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 28,480.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల బాట పట్టడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇండెక్స్‌ 175 పాయింట్లు లాభపడి 28662.10ల వద్ద కొత్త రికార్డు గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:00లకు ఇండెక్స్‌ గతముగింపు(28,443.70)తో పోలిస్తే అరశాతం లాభంతో 28,585.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
మార్కెట్‌ విషయానికొస్తే...
నేడు సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన మిశ్రమ సంకేతాలతో లాభనష్టాల మధ్య ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం గం.10:15ని.లకు నిఫ్టీ 2 పాయింట్ల స్వల్పలాభంతో 11303 వద్ద, సెన్సెక్స్‌ 20 పాయింట్లు పెరిగి 37,550 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంక్‌, అటో, ఫార్మా షేర్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ, రియల్టీ, ఆర్థిక, ప్రైవేట్‌ రంగ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. 



You may be interested

వచ్చే నెల్లో కొత్త రికార్డులు పక్కా?!

Wednesday 13th March 2019

నిఫ్టీపై అనలిస్టుల అంచనా కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించమని సూచన గతేడాది సాధించిన 11760.20 పాయింట్ల ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని వచ్చే నెల్లో దాటుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఇండెక్స్‌ ఆప్షన్స్‌లో కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించవచ్చని సూచిస్తున్నారు. సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చే లోపే సూచీలు సరికొత్త శిఖరాలు తాకుతాయని మార్కెట్‌ వర్గాల్లో అధికశాతం భావిస్తున్నాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు కూడా పెరగడంతో సూచీల పరుగు మరింత స్పీడవుతుందని

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 13th March 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్లు వివరాలు  మెజెస్కో:- అమెరికా అనుబంధ సంస్థ యూరోపిన్‌ కార్యనిర్వహణ అధికారిగా నార్మన్‌ కారోల్‌ను నియమిస్తున్నట్లు ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది.  ఎమ్‌ఎస్‌టీసీ:- నేడు ఐపీఓ ప్రారంభం కానుంది. ప్రైజ్‌బాండ్‌ రూ.121-128లుగా నిర్ణయించారు. ఎన్‌ఎమ్‌డీసీ:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.1 ముఖవిలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5.52 చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు రికార్డు తేదిని మార్చి 25గా నిర్ణయించింది. అవెన్యూ సూపర్‌మార్ట్‌:- రూ.100 కోట్ల విలువైన

Most from this category