బ్యాంక్ నిఫ్టీ 1.50శాతం అప్..!
By Sakshi

బ్యాంకు షేర్లలో జరుగుతున్న షార్ట్ కవరింగ్ కారణంగా నిఫ్టీబ్యాంక్ ఇండెక్స్ సూచీ గురువారం ట్రేడింగ్‌లో 1.50శాతం పెరిగింది. ఎన్ఎస్ఈలోని నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 26,641 వద్ద ప్రారంభమైంది. సాదారణంగా ఎఫ్&ఓ ట్రేడింగ్ చివరి రోజు ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో ఎక్కువగా ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అయితే నేటి ట్రేడింగ్‌లో షార్ట్ కవరింగ్ కారణంగా బ్యాంకింగ్ షేర్లు స్థిరమైన ర్యాలీని చేస్తుండటం విశేషం. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంపుపై వెనకడుగు వేయడంతో బ్యాంకు షేర్లకు కలిసొచ్చింది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ యస్బీఐ షేర్ల ర్యాలీతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఇంట్రాడేలో 1.50శాతం లాభపడి 26819.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్ గతముగింపు(26,457.95)తో పోలిస్తే 1.25శాతం లాభపడి 26,794.40 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఫెడరల్‌బ్యాంక్ 5శాతం లాభపడింది. అలాగే కోటక్ బ్యాంక్ 3శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2శాతం, యస్బీఐ ,ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1శాతం లాభపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బీఎల్ బ్యాంక్ అరశాతం పెరిగాయి. ఐడీఎఫ్సీ యస్‌బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్నేషనల్బ్యాంక్ షేర్లు 1.50శాతం వరకు నష్టపోయాయి.
You may be interested
10850పైన నిఫ్టీ
Thursday 29th November 2018మార్కెట్‌కు కలిసొచ్చిన పావెల్ వాఖ్యలు నాలుగోరోజూ లాభాలే ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై అంచనాలు సన్నగిల్లడంతో పాటు డాలర్ మారకంలో రూపాయి 3నెలల గరిష్టానికి బలపడటంతో నవంబర్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చివరి రోజు మార్కెట్ భారీ లాభంతో ముగిసింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర 58డాలర్లకు చేరుకోవడంతో రేపు జరిగే జీ-20 సదస్సులో అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ చర్చలు సానుకూల ఫలితాలు వెలువడవచ్చనే అశావహన అంచనాలు మార్కెట్
జోరుగా అటో షేర్ల ర్యాలీ
Thursday 29th November 20184శాతం లాభపడిన బజాజ్ అటో, మహీంద్రా షేర్లు మార్కెట్ ర్యాలీలో భాగంగా గురువారం అటో రంగ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఎన్ఎస్ఈలో అటోరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ అటోరంగ ఇండెక్స్ ఇంట్రాడేలో 2శాతం ర్యాలీ చేసింది. బజాజ్ అటో, మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 4శాతం ర్యాలీ చేశాయి. టీవీఎస్ మోటర్ 2.50శాతం, టాటామోటర్స్, అశోక్‌లేలాండ్, భాష్ లిమిటెడ్, అపోలోటైర్స్, భారత్ఫోర్జ్స్, హీరోమోటర్స్ కార్ప్, షేర్లు 1.50శాతం పెరిగాయి.