STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ జంప్‌

Wednesday 19th December 2018
Markets_main1545211235.png-23083

ద్రవ్యత్వ సంక్షోభం నుంచి గట్టేందుకు ఆర్‌బీఐ చేసిన బాండ్ల బైబ్యాక్‌ ఇష్యూ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌కు కలిసొస్తుంది. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో 1శాతం ర్యాలీ చేసింది. వచ్చే నెలలో బాం‍డ్ల బైబ్యాక్‌ ద్వారా రూ.50వేల కోట్ల నిధులను ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేస్తామని మంగళవారం ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 27,229.05ల వద్ద  ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో దాదాపు 1శాతం లాభపడి 27,364.35 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.2:25ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(27174.70)తో పోలిస్తే దాదాపు అరశాతం లాభంతో 27,364.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా యాక్సిస్‌ బ్యాంక్‌ 4శాతం లాభపడింది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 3శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాజ్‌నేషనల్‌బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 3శాతం ర్యాలీ చేశాయి. ఎస్‌బీఐ 2.50శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ యస్‌ బ్యాంక్‌ అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.50శాతం, కోటక్‌ బ్యాంక్‌ ఒకశాతం, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల అరశాతం నష్టపోయాయి.



You may be interested

వచ్చే ఏడాది 40000 స్థాయికి సెన్సెక్స్‌

Wednesday 19th December 2018

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ బీఎన్‌పీ పారిబాస్‌.. భారత్‌ వృద్ధిపై తటస్థంగా ఉంది. 2019లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,000 మార్క్‌ను అందుకుంటుందని అంచనా వేసింది. మంగళవారం నాటి ముగింపు స్థాయి 36,347 పాయింట్లతో పోలిస్తే 10 శాతానికి పైగా అప్‌సైడ్‌ ఉంటుందని పేర్కొంది. అయితే కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఇంకా పుంజుకోలేదని పేర్కొంది. ఇకపోతే రాజకీయ పరిస్థితుల వల్ల తలెత్తే అస్థిరతల విషయంలో

10,956 దాటితే.. 11,150కి నిఫ్టీ

Wednesday 19th December 2018

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత నిఫ్టీ జోరు చూపిస్తోందని యస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆదిత్య అగర్వాల్‌ తెలిపారు. ఫలితాల రోజు నాటి 10,333 కనిష్ట స్థాయి నుంచి 10,950 స్థాయి పైకి ఎగసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండెక్స్‌ తన 100 రోజుల సింపుల్‌ మూవింగ్‌ యావరేజ్‌ 10,956కు పైన ట్రేడ్‌ అవుతోందని తెలిపారు. నిఫ్టీ ఈ స్థాయికి పైన స్థిరంగా కొనసాగితే అప్పుడు 11,100- 11,150 శ్రేణిలోకి

Most from this category