STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీకి భారీనష్టం

Tuesday 18th September 2018
Markets_main1537267221.png-20358

బ్యాంకింగ్‌ షేర్లలో పతనంలో భాగంగా నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 1.50శాతం నష్టపోయింది. నేడు 26,407ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఈ సూచీలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 19శాతం నష్టపోగా, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సి్‌స్‌ బ్యాంక్‌, 4శాతం నుంచి 3శాతం క్షీణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు షేర్లు 2నుంచి 1శాతం వరకు పతనమయ్యాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అరశాతం నష్టపోయింది. మరోవైపు ఆర్‌బీఎల్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి. ఇంట్రాడేలో 400 పాయింట్లు నష్టపోయి 26,407 వద్దకు చేరుకుంది. చివరకు గత ముగింపు(26,820)తో పోలిస్తే 1.50శాతం నష్టపోయి 26,441 వద్ద ముగిసింది.



You may be interested

స్వల్పకాలానికి ఈ  షేర్లు చూడొచ్చు

Tuesday 18th September 2018

సమీప భవిష్యత్తులో నిఫ్టీపై ఒత్తిడి కొనసాగుతుందని, 10,200 సమీపంలో మద్దతు పొందవచ్చని, 10,523 పాయింట్ల వద్ద పటిష్టమైన నిరోధాన్ని చవిచూడవచ్చని సాంక్ట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ విశ్లేషకుడు ఆశిష్‌ చాతుర్‌మెహతా అంచనావేస్తున్నారు. ఒక ఆంగ్లచానల్‌తో ఆయన మార్కెట్‌పై అభిప్రాయాల్ని పంచుకుంటూ స్వల్పకాలంలో లాభాలను అందించే  అవకాశం వున్న  షేర్లను సూచించారు. ఆ సిఫార్సులివే... ఐషర్‌ మోటార్స్‌ సిఫార్సు: బై, ప్రస్తుత ధర: రూ.29,664, టార్గెట్‌: రూ. 32,000–32,700, స్టాప్‌లాస్‌: రూ. 28,800 గత ఏడాదికాలంలో

11300 దిగువన నిఫ్టీ ముగింపు

Tuesday 18th September 2018

మార్కెట్‌ పతనం మంగళవారమూ కొనసాగింది. బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో, మెటల్‌ రంగ షేర్లలో చివరి గంటలో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా కేంద్రం మరో మూడు ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి తెరతీయడంతో బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల క్షీణత నేటి మార్కెట్‌ను నష్టాల బాట పట్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో తొలగని వాణిజ్య యుద్ధ భయాలు, మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు, రూపాయి క్షీణత

Most from this category