STOCKS

News


25000 దిగువకు నిఫ్టీ బ్యాంక్‌

Thursday 25th October 2018
Markets_main1540450973.png-21479

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా గురువారం నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 25000ల దిగువకు పతనమైంది. నేడు బ్యాంకు ఇండెక్స్‌ 24,841.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఈ సూచీలో అధిక వెయిటేజ్‌ గల ఎస్‌బీఐ (2.50శాతం) ఐసీఐసీఐ (2శాతం) నష్టపోయాయి. ఫలితంగా ఇండెక్స్‌ ఏకంగా 1.25శాతం నష్టపోయి 25,064.20 కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపుతో పోలిస్తే 1శాతం నష్టంతో 24,829ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన 12 షేర్లలో 11 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఒక్క కోటక్‌ బ్యాంక్‌ షేరు మాత్రం అరశాతం లాభపడింది. అత్యధికంగా ఐడీఎఫ్‌సీ బ్యాంకు 3శాతం నష్టపోయింది. ఫెడరల్‌ బ్యాంక్‌, బ్యాంకు ఆఫ్‌ బరోడా 2శాతం క్షీణించాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 1శాతం పతనమయ్యాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ అరశాతం నష్టపోయాయి.



You may be interested

అమెరికాకు వచ్చే రోజులు చాలా కీలకం!!

Thursday 25th October 2018

రానున్న కొన్ని రోజులు అమెరికా మార్కెట్లకు చాలా కీలకమని పోస్ట్‌ షెల్టర్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ రిచర్డ్‌ హ్యారిస్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కంపెనీల నుంచి వెలువడుతున్న ఎర్నింగ్స్‌ అంత చెత్తగా అయితే లేవని పేర్కొన్నారు. ఆర్థికాంశాలు కూడా బాగానే ఉన్నాయని, అయితే కొంచెం దిగాలుగా ఉన్నాయని తెలిపారు. అలాగే గృహ విక్రయాలు బలంగా లేవని పేర్కొన్నారు. టారిఫ్‌

బేర్‌ పట్టు బిగుస్తోంది!

Thursday 25th October 2018

ప్రపంచ మార్కెట్లపై క్రమంగా పెరుగుతున్న బేర్స్‌ ఆధిపత్యం కరెక‌్షన్‌ మూడ్‌లోకి పలు దేశాల ఈక్విటీలు ప్రపంచ పెద్దన్న యూఎస్‌ఏ మార్కెట్‌ ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 2.5 శాతం లాభంలో ఉంది. అయితే యూఎస్‌ఏ మార్కెట్లను చూసి ప్రపంచ ఈక్విటీలన్నీ బాగానే ఉన్నాయనుకుంటే పొరపాటని, వరల్డ్‌ మార్కెట్లన్నీ ఒకదాని వెనుక ఒకటి బేర్‌ గుప్పిట్లో గట్టిగా చిక్కుకున్నాయని రాయిటర్స్‌ డేటా చెబుతోంది. ప్రపంచ మార్కెట్ల పనితీరును ఎంఎస్‌సీఐ- ఆల్‌ కంట్రీ వరల్డ్‌ ఇండెక్స్‌

Most from this category