STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం అప్‌

Tuesday 14th May 2019
Markets_main1557820198.png-25732

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ, ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాంక్‌ నిఫ్టీ స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతోంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌(పీఎస్‌యూ) షేర్ల ర్యాలీ బ్యాంక్‌ నిప్టీ లాభాల ట్రేడింగ్‌కు కారణమవుతోంది. గత ట్రేడింగ్‌లో భారీ పతనమైన పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లలో నేడు రివకరీ బాట పట్టాయి.అలాగే నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం పీఎస్‌యూ బ్యాంక్‌లైన ఆంధ్రా బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) ఆశాజనకమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. (పీఎస్‌యూ) షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ఆఫ్‌బరోడా 4శాతం లాభపడింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 3శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 1శాతం పెరిగింది. వాటితో పాటు ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లైన ఐసీఐసీఐ బ్యాంక్‌ 2శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1.50శాతం పెరిగాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 2.50శాతం, కోటక్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1శాతం నష్టపోయాయి. అలాగే యస్‌బ్యాంక్‌, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.12:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(28,659.95)తో పోలిస్తే 0.30శాతం లాభంతో 28,747.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌ 12 శాతం డౌన్‌

Tuesday 14th May 2019

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లకు నష్టాల కష్టాలు ఇప్పట్లో వీడేలా లేవు. ఈ కంపెనీ షేర్లు మంగళవారం మరో 12శాతం నష్టపోయాయి. కంపెనీ డిప్యూటీ ఛైర్మన్‌, ఛీప్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ అమిత్‌ అగర్వాల్‌ రాజీనామా చేయడం ఇందుకు కారణమైంది. నేడు జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు బీఎస్‌ఈలో రూ.125.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వ్యక్తిగత కారణాలతో కంపెనీకి డిప్యూటీ ఛైర్మన్‌, ఛీప్‌ ఫైనాన్స్‌ ఆఫీసరుగా సేవలు అందిస్తున్న అమిత్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారు. మే

భారతే బెస్ట్‌!

Tuesday 14th May 2019

ట్రేడ్‌ టెన్షన్లను తప్పించుకోవాలంటే ఇండియానే శరణు ఎఫ్‌ఐఐల అంచనా ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూపులు అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు ముదురుతున్న సమయాన పెట్టుబడులు సురక్షితంగా ఉండేందుకు భారత ఈక్విటీలే మంచివని ఎఫ్‌ఐఐలు భావిస్తున్నాయి. అయితే ఎన్నికలు పూర్తవుతున్నందున ఫలితాలను బట్టి ప్రణాళిక రచించుకోవాలని యోచిస్తున్నాయి. ఈ నెల్లో ఎఫ్‌ఐఐలు దేశీ ఈక్విటీల్లో దాదాపు 150 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. గత మూడు నెలల్లో విదేశీ మదుపరులు 1000 కోట్ల డాలర్లను ఇండియాలోకి

Most from this category