STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Monday 25th March 2019
Markets_main1553509284.png-24789

మార్కెట్లో జరిగిన అమ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం 1శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం ఇండెక్స్‌ను భారీగా నష్టపోయింది. ముఖ్యంగా ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లైన ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ షేర్ల 2శాతం పతనం ఇండెక్స్‌ను భారీగా దెబ్బతీశాయి. అలాగే ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ బ్యాంక్‌, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం మేర నష్టపోయాయి. ఇంట్రాడేలో ఒకానొక దశలో 426 పాయింట్ల నష్టపోయి 29,156.25 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో కొంత కొనుగోళ్లు జరగడంతో భారీ నష్టాలు తగ్గాయి. చివరికి మార్కెట్‌ ముగిసే సమయానికి 300 పాయింట్లు నష్టపోయి 29,281 వద్ద స్థిరపడింది.



You may be interested

38000 దిగువన సెన్సెక్స్‌ ముగింపు

Monday 25th March 2019

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలు మార్కెట్‌ రెండోరోజూ ముంచేశాయి. వరుస ర్యాలీ అనంతరం గత శుక్రవారం క్షీణించిన భారత్‌ సూచీలు సోమవారం సైతం పతనమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా సెన్సెక్స్‌ 38000 స్థాయిని కోల్పోగా, నిఫ్టీ 100 పాయింట్లను నష్టపోయింది. అన్ని రంగ షేర్లలో తీవ్రతరమైన అమ్మకాలతో సెన్సెక్స్‌ 355 పాయింట్లు పతనమై 37,809 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లను నష్టపోయి 11,354 వద్ద ముగిసింది. అమెరికా కేంద్ర

బ్రోకరేజ్‌ల నుంచి షార్ట్‌టర్మ్‌ సిఫార్సులు

Monday 25th March 2019

వచ్చే రెండు మూడువారాల్లో మంచి రాబడినందించే పది షేర్లను వివిధ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి.  ఏంజిల్‌ బ్రోకింగ్‌ 1. హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 192. స్టాప్‌లాస్‌ రూ. 167. దిగువన రూ.145 నుంచి ఒక్కపాటున అప్‌మూవ్‌ చూపి రూ. 184 వరకు ఎగిసింది. అనంతరం కన్సాలిడేషన్‌ చెంది రూ. 170 స్థాయికి చేరింది. చార్టుల్లో జపనీస్‌ క్యాండిల్‌స్టిక్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. వాల్యూం కదలికలు అప్‌మూవ్‌కు అనుకూంలగా ఉన్నాయి. 2. ఇన్ఫోసిస్‌:

Most from this category