STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 2శాతం డౌన్‌

Monday 22nd April 2019
Markets_main1555927353.png-25272

మార్కెట్‌ పతనంలో సోమవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. నేడు నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 30,282.50ల వద్ద ప్రారంభమైంది. అటు ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఇటు ప్రైవేట్‌రంగ బ్యాంకు షేర్ల పతనంతో ఇంట్రాడేలో 2శాతం నష్టపోయి 29,686.80  కనిష్టానికి పతనమైంది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. మరో​ అరగంటలో మార్కెట్‌ ముగుస్తున్నదనగా... యస్‌ బ్యాంక్‌ 7శాతం క్షీణించింది. ఇండస్‌ ఇండ్‌, పంజాజ్‌నేషనల్‌బ్యాంక్‌ 4శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.50శాతం చొప్పున నష్టపోయాయి. ఐడీఎఫ్‌సీఫస్ట్‌బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం చొప్పున పతనమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ 1శాతం నష్టపోగా, యస్‌బీఐ బ్యాంక్‌ అరశాతం క్షీణించింది. అయితే ఆర్‌బీఎల్‌ బ్యాంకు మాత్రం 1శాతం లాభాల్లో ఉంది.You may be interested

బాండ్లపై ఎఫ్‌ఐఐల అనాసక్తి

Monday 22nd April 2019

దేశీయ ఈక్విటీలపై మక్కువ చూపుతున్న విదేశీ సంస్థాగత మదుపరులు దేశీయ బాండ్‌ మార్కెట్‌పై శీతకన్నేస్తున్నారు. ఒకపక్క ఈక్విటీల్లో ఇబ్బడిముబ్బడిగా కొనుగోళ్లు చేస్తున్న ఎఫ్‌ఐఐలు డెట్‌ మార్కెట్లో నికర విక్రేతలుగా మారారు. ఈ నెల్లో ఇంతవరకు అంతర్జాతీయ ఫండ్స్‌ సావరిన్‌, కార్పొరేట్‌ బాండ్స్‌ నుంచి రూ. 8950కోట్ల రూపాయలు ఉపసంహరించుకున్నారని ఎన్‌ఎస్‌డీ డేటా చెబుతోంది. మార్చిలో విదేశీ ఫండ్స్‌ బాండ్‌ మార్కెట్లో దాదాపు 17వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపారు. ఉన్నట్లుండి

వేడెక్కుతున్న చమురు ధర

Monday 22nd April 2019

ఇరాన్‌- యూఎస్‌ సంక్షోభమే కారణం సోమవారం ఆరంభ ట్రేడింగ్‌లో అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 2 శాతం పైగా లాభపడ్డాయి. ఇరాన్‌ చమురు దిగుమతులపై ఆంక్షలు విధించిన అమెరికా, కొన్నిదేశాలకు తాత్కాలిక మినహాయింపులు ఇచ్చింది. తాజాగా ఈ మినహాయింపులను ఉపసంహరించుకునేందుకు రెడీగా ఉందని రాయిటర్స్‌ కథనం పేర్కొంది. దీంతో వారం ఆరంభంలో ఒక్కసారిగా చమురు ధరలు పైకి ఎగిశాయి. బ్రెంట్‌ క్రూడ్‌ దాదాపు 74 డాలర్లకు చేరువైంది. డబ్ల్యుటీఐ క్రూడ్‌ 65

Most from this category