STOCKS

News


28,000 దిగువకు బ్యాంక్‌ నిఫ్టీ

Monday 13th August 2018
Markets_main1534139518.png-19215

ముంబై:- ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన నిఫ్టీ బ్యాంకు సూచీ సోమవారం ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా పతనమై 28వేల మార్కును కోల్పోయింది. నేడు ఈ సూచీ 27,760 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాంకు షేర్లు నష్టాల బాట పట్టడంతో ఇటీవల అందుకున్న నిఫ్టీ బ్యాంకు  28వేల పాయింట్ల మార్కును కోల్పోయింది. ఈ సూచీలోని హెవీ వెయిటేజ్‌ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యస్‌బ్యాంకు, ఇండస్‌ ఇండస్‌ బ్యాంకు షేర్లు 1శాతానికి పైగా నష్టపోవడంతో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1.36శాతం (385 పాయింట్లు) నష్టపోయి 27,739 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది.  ఉదయం గం.10:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు 28,124.25 పాయింట్లతో పోలిస్తే 1శాతం(304.05 పాయింట్లు) నష్టంతో 27,820.20 పాయింట్ల ట్రేడ్‌ అవుతోంది. ఇక ఇదే సమయానికి ఐడీఎఫ్‌సీ బ్యాంకు 2శాతం, కోటక్‌ బ్యాంకు 0.10శాతం స్వల్ప లాభంతోట్రేడ్‌ అవుతుండగా, మిగతా షేర్లన్ని నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా ఎస్‌బీఐ  షేరు 3శాతానికి పైగా నష్టపోయింది.
1శాతానికి పైగా నష్టపోయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు:- సంస్థ డిప్యూటీ ఎం.డీ. ప్రకాష్‌ సుక్తంకర్‌ రాజీనామా ప్రభావం బ్యాంకు షేర్లపై పడింది. నేడు ఎన్ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.2,084.00ల వద్ద ట్రేడింగ్‌ను  ప్రారంభించింది. ఇంట్రాడేలో 1.62శాతం నష్టపోయి రూ.2,084.00 కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.10:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.2,114.45)తో పోలిస్తే 1.37శాతం నష్టంతో రూ.2,085.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ నేటి ఇంట్రాడేలో ఇప్పటికి వరకు నష్టపోయి 87.85 పాయింట్లలో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరువి 14.53 పాయింట్లు కావడం గమనార్హం. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1,731.15లు రూ.2,220.00లుగా నమోదయ్యాయి.


NSE

You may be interested

రూపీ పతనం.. అసలు కారణం లిరా కాదు..

Monday 13th August 2018

ఇండియన్‌ రూపాయి పతనానికి టర్కీస్‌ లిరా, అమెరికా డాలర్‌ బలోపేతమవ్వడం వంటి అంశాలు ప్రధాన కారణం కాదని చెబుతున్నారు ఏఎన్‌జెడ్‌ ఆసియా రీసెర్చ్‌ హెడ్‌ ఖూన్‌ గోహ్‌.  ఆసియాలో విస్తరిస్తున్న నెగిటివ్‌ సెంటిమెంట్‌, వర్ధమాన మార్కెట్లు బలహీనంగా ఉండటం వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ‘టర్కీ కరెన్సీ లిరా భారీగా పతనమైంది.  యూరో కూడా ఏడాది కనిష్టానికి పడిపోయింది.

నెలరోజుల కోసం టాప్‌ టెన్‌ సిఫార్సులు

Monday 13th August 2018

వచ్చే నెల రెండు నెలల్లో 14 శాతం వరకు లాభాన్నిచ్చే పది స్టాక్స్‌ను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. ఏంజల్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు 1. టాటాస్టీల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 610. స్టాప్‌లాస్‌ రూ. 553. గత రెండు వారాలుగా మెటల్‌ స్టాకుల్లో టాటాస్టీల్‌ టర్న్ ఎరౌండ్‌ చూపి అప్‌మూవ్‌లోకి మళ్లింది. గత వారం రూ. 565ను దాటి బుల్లిష్‌ బ్రేకవుట్‌ సాధించింది. వారం చార్టుల్లో మరింత అప్‌మూవ్‌ అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో

Most from this category