STOCKS

News


అరశాతం నష్టపోయిన బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 18th April 2019
Markets_main1555575703.png-25205

ప్రభుత్వరంగ షేర్ల పతనంతో గురువారం ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ గురువారం ట్రేడింగ్‌లో 0.75శాతానికి పైగా నష్టపోయింది. నేడు బ్యాంకు నిఫ్టీ 30,656.50 వద్ద ప్రారంభమైంది. యస్‌ బ్యాంక్‌ 3.5శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 3శాతం నష్టపోయాయి. ఇండస్‌ ఇండ్‌ 2శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), ఇడీఎఫ్‌సీఫస్ట్‌ బ్యాంక్ 1.50శాతం క్షీణించాయి. ఫెడరల్‌ బ్యాంక్‌ 1శాతం పతనమైంది. వాటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం పతనయ్యాయి. ఫలితంగా ఇంట్రాడేలో 0.75శాతం క్షీణించి 30308.40 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:15ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(30,531.35)తో పోలిస్తే అరశాతం నష్టంతో 30,365.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఇక ఇదే సమయానికి బెంచ్‌ మార్క్‌ సూచీలైన నిఫ్టీ 17.05 పాయింట్లు నష్టపోయి 11,770.10 వద్ద, 46 పాయింట్ల నష్టపోయి 39,229.68 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

 



You may be interested

విప్రో షేరును ఏం చేయొచ్చు?

Thursday 18th April 2019

క్యు4లో మంచి లాభాలు ప్రకటించిన విప్రోపై బ్రోకరేజ్‌లు మిశ్రమంగా ఉన్నాయి. 1. నోమురా: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 270. క్యు4 ఫలితాల్లో  రెవెన్యూ గ్రోత్‌, మార్జిన్లు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. కానీ గ్రోత్‌ గైడెన్స్‌ అంచనాలు బలహీనంగా ఉన్నాయి. బైబ్యాక్‌ ముందు అనుకున్న విధంగానే ఉంది. కానీ గైడెన్స్‌ అంచనాలు భవిష్యత్‌ పేలవంగా ఉండొచ్చని సూచిస్తున్నాయి. 2. సిటీగ్రూప్‌: అమ్మొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 230. ఫలితాలు బాగున్నా, గైడెన్స్‌ నిరాశపరిచింది.

మెటల్‌ షేర్ల పతనం

Thursday 18th April 2019

మార్కెట్‌ నష్టాల్లో భాగంగా గురువారం మెటల్‌ భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ నేడు 2శాతం నష్టపోయింది. నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మెటల్‌ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఫలితంగా జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ 4శాతం, సెయిల్‌ 3.50శాతం, వేదాంత, హిందాల్కో 3శాతం, జేఎస్‌ఎల్‌ హిస్సార్‌ స్టీల్‌, నాల్కో షేర్లు 2.50శాతం నష్టపోయాయి. టాటాస్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌, వెల్‌స్పాన్‌ కార్ప్‌ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మెయిల్‌ షేర్లు

Most from this category