STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం క్రాష్‌

Wednesday 12th September 2018
Markets_main1536730741.png-20193

ముంబై:- ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఉదయం సెషన్స్‌లో ఒడిదుడుకుల నడుమ ట్రేడ్‌ అవుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 11300ల స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌, అటో, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌ రంగ షేర్లు నష్టపోతున్న తరుణంలో నిఫ్టీ బ్యాంకు సూచి దాదాపు 1శాతం వరకు నష్టపోయింది.
నిఫ్టీ బ్యాంక్‌ సూచి:- నిన్నటి ట్రేడింగ్‌లో దాదాపు 400 పాయింట్లు క్షీణించి 27వేల దిగువ చేరుకున్న నిఫ్టీ బ్యాంకు సూచీ నేడు 26,895 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో బ్యాంక్‌ షేర్ల పతనం కారణంగా నిఫ్టీ సూచి దాదాపు 1శాతం(200 పాయింట్లు) నష్టపోయి 26,612 కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం:10:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(26,807)తో పోలిస్తే 0.30శాతం నష్టపోయి 26,728 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచిలో భాగమైన మొత్తం 12 షేర్లకు గానూ 10 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 2షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా బ్యాంకు ఆఫ్‌ బరోడా షేర్లు 4శాతం నష్టపోగా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, పీఎన్‌బీ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేర్లు 3నుంచి 1శాతం పతనమయ్యాయి. అలాగే యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఇదే సమయానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం వరకు లాభపడ్డాయి.



You may be interested

రాష్ట్రాలకు పెట్రో ధరలు తగ్గించే వెసులుబాటు!

Wednesday 12th September 2018

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలూ తీవ్రంగా ఉన్నాయి. దీనితో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఆయా అంశాలు రాష్ట్రాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీ మొత్తంలో రూ.22,700 కోట్ల ‘వ్యాట్‌’ (వీఏటీ) ఆదాయాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఎస్‌బీఐ రిసెర్చ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్‌ ధర సగటున 75 డాలర్లు,

భారత మార్కెట్లోకి బ్లౌపంక్ట్‌ టీవీలు

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ బ్లౌపంక్ట్‌  భారత మార్కెట్లోకి ఎనిమిది టీవీ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. మూడు సిరీస్‌ల్లో ఈ టీవీలు లభిస్తాయని వీటి ధరలు రూ.12,999 నుంచి రూ.47,999 రేంజ్‌లో ఉంటాయని బ్లౌపంక్ట్‌ టెలివిజన్‌  ఇండియా ఎమ్‌డీ, సీఈఓ కరణ్‌ బేడి తెలిపారు. ఈ టీవీల విక్రయం కోసం ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని బ్లౌపంక్ట్‌ భారత భాగస్వామి,  ట్రిగుర్‌ ఎలక్ట్రానిక్స్‌కు ఎమ్‌డీగా

Most from this category