STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌..!

Tuesday 12th February 2019
Markets_main1549964946.png-24159

మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అ‍మ్మకాలతో మార్కెట్‌ భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండెక్స్‌లో అధిక పరిమాణం కలిగిన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం క్షీణతతో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం మేర పతనమైంది. మధ్యాహ్నం గం.2:50ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(27,227.80)తో పోలిస్తే 0.75శాతం నష్టంతో 27,036.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండస్‌ ఇండ్‌ 1శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ షేర్ల అరశాతం పతనమయ్యాయి. మరోవైపు ఐడీఎఫ్‌సీఫస్ట్‌బ్యాంక్‌ ఒకశాతం లాభపడగా, పీఎస్‌బీ షేరు అరశాతం పెరిగింది.



You may be interested

ప్లెడ్జ్‌ షేర్లతో భయపెడుతున్న బేర్స్‌

Tuesday 12th February 2019

మార్కెట్లు భయాందోళనలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లను మరింత భయపెట్టేందుకు కొన్ని కధలు ప్రచారమవుతాయని, ప్రస్తుతం ప్లెడ్జ్‌షేర్లపై వస్తున్న కధనాలతో బేర్‌ ఆపరేటర్లు పనిగడుపుకుంటున్నారని ప్రముఖ అనలిస్టులు చెబుతున్నారు. ఇప్పట్లో కొనుగోళ్ల మద్దతు లభించని కంపెనీల గురించి పూర్తిగా తెలుసుకొని వాటి షేర్లపై దాడి చేస్తున్నారన్నారు. ఒకపక్క ఆ షేరుపై దాడి చేయడం, మరోపక్క ప్లెడ్జ్‌ షేర్లపై కధనాలు ప్రచారంలో ఉంచడం ద్వారా షార్ట్‌ పొజిషన్లు, పుట్‌ పొజిషన్లలో భారీ లాభాలు సంపాదిస్తున్నారని

మెటల్‌ షేర్ల ర్యాలీ

Tuesday 12th February 2019

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌ షేర్ల ర్యాలీ మార్కెట్‌ పతనానికి అడ్డుగా నిలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 3శాతం ర్యాలీ చేసింది. మెటల్‌ షేర్లలో అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ 9శాతం ర్యాలీ చేసింది. సెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌, టాటాస్టీల్‌ షేర్లు 5శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. అలాగే వేదాంత, జేఎస్‌ఎల్‌హిస్సార్‌, వెల్‌స్పాన్‌కార్పోరేషన్‌, ఎన్‌ఎండీసీ షేర్లు

Most from this category