STOCKS

News


కొత్త ఆల్‌టైం హైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 28th March 2019
Markets_main1553763002.png-24847

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో గురువారం బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. నేడు బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 30,064.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభపడటంతో ఇండెక్స్‌ ర్యాలీ చేసింది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ఇండెక్స్‌ను పరుగులు పెట్టింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌, స్టే్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభపడంతో ఇంట్రాడే ఇండెక్స్‌ 1.50శాతం(432 పాయింట్లు) లాభపడి 30,451.70 స్థాయికి తాకింది. ఈ స్థాయి ఇండెక్స్‌కు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యా‍హ్నం గం.2:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(30,019.80)తో పోలిస్తే 1.20శాతం(325 పాయింట్లు) లాభపడి 30,400.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 6శాతం లాభపడింది. అయితే ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మాత్రం 1శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. 
ఇదే సమాయానికి నిఫ్టీ 108 పాయింట్లు పెరిగి 11,553 వద్ద, సెన్సెక్స్‌ 356పాయింట్లు లాభపడి 38,488 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

బ్యాంకింగ్‌ స్టాకులపై పాజిటివ్‌

Thursday 28th March 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ బ్యాంకింగ్‌ రంగంపై తాము పూర్తి పాజిటివ్‌గా ఉన్నట్లు కోటక్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ రుస్మిక్‌ ఓజా చెప్పారు. బ్యాంకు స్టాకుల్లో ఇంకా వాల్యూ ఉందన్నారు. ప్రైస్‌ టు బుక్‌ వాల్యూ పరంగా చూస్తే బ్యాంకు స్టాకుల వాల్యూషన్లు ఇంకా గరిష్ఠాలకు చాలా దూరంలో ఉన్నాయన్నారు. బ్యాంకుల్లో తాము కార్పొరేట్‌ బ్యాంకులకు, ప్రైవేట్‌ బ్యాంకులకు తొలి ప్రాధానమిస్తామని చెప్పారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో బడా బ్యాంకులైతేనే బెటరన్నారు. కార్పొరేట్‌ బ్యాంకుల విషయంలో

తాజా ర్యాలీలో పాల్గొనని షేర్లను ఎంచుకోండి!

Thursday 28th March 2019

టాటా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీకి అతిపెద్ద రిస్కు హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడడమేనని టాటాఅసెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఐఓ రాహుల్‌ సింగ్‌ చెప్పారు. అలా జరిగేందుకు చాలా తక్కువ ఛాన్సుందని, కానీ అలా జరిగితే మాత్రం మార్కెట్‌ పతనాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏడాదికి మించి కొనసాగలేవని అభిప్రాయపడ్డారు. తొలి విడత పోలింగ్‌ తేదీ నుంచి ఫలితాల విడుదల తేదీ వరకు మదుపరులకు అనిశ్చితి తప్పదన్నారు.

Most from this category