STOCKS

News


పాజిటివ్‌గా ఐషర్‌మోటర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌

Friday 16th August 2019
Markets_main1565933430.png-27804

జూన్‌ 2007 తర్వాత అమెరికాలో, ఇన్వెర్టడ్‌ ఈల్డ్‌ కర్వ్‌ ఏర్పడడంతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన యుఎస్‌ ఆర్థిక మాంద్యం వైపు కదులుతోందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి శుక్రవారం కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రభావం వలన దేశియ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. కాగా నిఫ్టీ ఆటో షేర్లు శుక్రవారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన ఎంఆర్‌ఎఫ్‌ 0.08 శాతం, ఐషర్‌ మోటర్స్‌ 0.76 శాతం, మారుతి 0.66 శాతం, బజాజ్‌ ఆటో 0.64 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 1.12  శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఫలితాల ప్రభావంతో బోచ్‌ లి. 0.45 శాతం నష్టపోయి ట్రేడవుతోంది. మొత్తంగా నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఉదయం 10.45 సమయానికి 0.23 శాతం లాభపడి 6,934.65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో మిగిలిన షేర్లయిన  అపోలో టైర్స్‌ 1.47 శాతం, మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం) 0.42 శాతం లాభపడి ట్రేడవుతుండగా,  టాటా మోటర్స్‌ 1.94 శాతం, భారత్‌ ఫోర్జ్‌ 1.90 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 1.07 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 0.72 శాతం, మదర్‌ సుమీ 0.46 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 0.31 శాతం, అశోక్‌ లేలాండ్‌ 0.24 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.  



You may be interested

అయిదు నిముషాల్లోనే బ్యాటరీ చార్జింగ్‌

Friday 16th August 2019

ఆటోను అభివృద్ధి చేసిన అదరిన్‌ ఇంజనీరింగ్‌ అక్టోబరు నుంచి భారత్‌లో అందుబాటులోకి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- భారత ఆటోమొబైల్‌ రంగంలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్‌’ హాట్‌ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ఉన్న కంపెనీలు అధిక సామర్థ్యమున్న బ్యాటరీల తయారీపై ఫోకస్‌ చేశాయి. ఈవీ టెక్నాలజీలో ఉన్న సింగపూర్‌ సంస్థ షాడో గ్రూప్‌ అనుబంధ కంపెనీ అయిన బెంగళూరుకు చెందిన అదరిన్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీస్‌ ఓ అడుగు ముందుకేసి అల్ట్రా కెపాసిటర్‌ బ్యాటరీని

దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని సమీక్ష

Friday 16th August 2019

మంత్రి నిర్మలా సీతారామన్‌, ఉన్నతాధికారులో భేటీ అన్ని అంశాలపై సమగ్ర చర్చ త్వరలో చర్యలకు అవకాశం న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రధాని నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మందగమన పరిస్థితులు ఒకదాని తర్వాత మరో రంగానికి వేగంగా విస్తరిస్తుండడం, ఉద్యోగాలు, సంపదకు విఘాతం కలుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో

Most from this category